Skip to main content

UPI Payments in UAE: యూఏఈకి విస్తరించిన యూపీఐ సేవలు!

దేశంలో డిజిటల్‌ చెల్లింపులకు కీలకంగా ఉన్న యూపీఐ సేవలను యూఏఈకి విస్తరిస్తున్నట్లు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) తెలిపింది.
NPCI International Expands UPI Payments in UAE

ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ సీఈఓ రితేష్ శుక్లా తెలిపిన వివ‌రాల మేర‌కు.. ‘ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ మిడిల్‌ ఈస్ట్‌(మధ్యప్రాచ్య దేశాలు), ఆఫ్రికాలోని డిజిటల్ కామర్స్‌లో సేవలందిస్తున్న ‘నెట్‌వర్క్ ఇంటర్నేషనల్‌’తో భాగస్వామ్యం కలిగి ఉంది. కాబట్టి యూఏఈలో యూపీఐ సేవలందించే ప్రక్రియ సులువైంది. 

యూఏఈలోని భారతీయులు, ప్రయాణికులు, టూరిస్టులు పాయింట్-ఆఫ్-సేల్ (పీఓఎస్‌) టెర్మినల్స్‌లో క్యూఆర్‌ కోడ్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు. 2024లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 98 లక్షలుగా ఉంటుందని అంచనా. అందులో యూఏఈ ద్వారానే 52.9 లక్షల మంది రాకపోకలు జరిపే అవకాశం ఉంది. కాబట్టి వినియోగదారులకు ఈ సేవలు ప్రారంభించాం’ అని తెలిపారు. 

ఎన్‌పీసీఐ ఇప్పటికే నేపాల్, శ్రీలంక, మారిషస్, సింగపూర్, ఫ్రాన్స్, భూటాన్‌లలో  ఈ యూపీఐ సేవలను ఆమోదించింది.

Interest Rates: పొదుపు ప‌థ‌కాల‌పై ప్రస్తుత వడ్డీ రేట్లు ఇవే..

Published date : 05 Jul 2024 10:11AM

Photo Stories