Chang'e-6 Lunar Mission: చంద్రుడి అవతలి వైపు నుంచి మట్టి నమూనాలను సేకరించి చరిత్ర సృష్టించిన చైనా..
చందమామపై మనకు కనిపించని అవతలివైపు భాగం నుంచి మట్టి నమూనాలను విజయవంతంగా భూమిపైకి తీసుకొచ్చింది.
చాంగ్‌యీ-6 మిషన్ వివరాలు ఇవే..
➣ చైనా ప్రయోగించిన లూనార్ ప్రోబ్ చాంగ్‌యీ-6 జూన్ 25వ తేదీ ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియాలో సురక్షితంగా దిగింది.
➣ ఈ మిషన్ చంద్రుడి అవతలి వైపు నుంచి మట్టిని సేకరించి భూమికి తీసుకువచ్చిన మొట్టమొదటి మిషన్.
➣ చాంగ్‌యీ-6 మార్చి 3వ తేదీ ప్రయోగించబడింది. 53 రోజుల ప్రయాణం తర్వాత చంద్రుడిని చేరుకుంది.
➣ రోబోటిక్ ల్యాండర్ రెండు రోజులపాటు మట్టి నమూనాలను సేకరించింది. ఆ తర్వాత జూన్ 4వ తేదీ తిరుగు ప్రయాణం ప్రారంభించింది.
➣ నమూనాలు జూన్ 6వ తేదీ భూమి కక్ష్యలోకి చేరగా.. జూన్ 25వ తేదీ భూమిపైకి తీసుకురాబడ్డాయి.
Aditya-L1: సూర్యుడి రహస్యాలను అన్వేషించే భారతీయ అంతరిక్ష నౌక ఇదే..
ఈ ఘనత యొక్క ప్రాముఖ్యత ఇదే..
➣ చంద్రుడి అవతలి వైపు నుంచి మట్టి నమూనాలను సేకరించిన మొట్టమొదటి దేశం చైనా.
➣ ఈ నమూనాలు చంద్రుడి పుట్టుక, పరిణామం గురించి శాస్త్రవేత్తలకు అమూల్యమైన సమాచారాన్ని అందిస్తాయి.
➣ అంతరిక్ష పరిశోధనలలో చైనా సామర్థ్యాన్ని ఈ ఘనత ప్రపంచానికి చాటిచెప్పింది.
➣ చైనా 2030 నాటికి చంద్రుడిపైకి మానవులను పంపించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Anti Radiation Missile: యాంటీ రేడియేషన్ మిసైల్.. ‘రుద్ర ఎమ్-2’ పరీక్ష విజయవంతం