Skip to main content

Budget 2024-25: ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. బడ్జెట్‌లో ఆ ప్రకటన ప్రకటించే అవకాశం!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23వ తేదీ పార్లమెంట్‌లో 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించనున్నారు.
Finance Minister Nirmala Sitharaman  2024-25 Budget Presentation  Budget Expectations 2024-25  Various Sectors Budget Expectations  Budget 2024-25: Will Nirmala Sitharaman announce 8th Pay Commission for central government employees

ఈ బడ్జెట్‌కు సంబంధించి వివిధ రంగాలు అనేక అంచనాలను పెట్టుకున్నాయి. మరోవైపు ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం అమలును కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
 
వాస్తవానికి 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్‌బీ యాదవ్‌ భారత ప్రభుత్వ కేబినెట్‌ కార్యదర్శికి లేఖ రాశారు. పాత పెన్షన్ స్కీమ్ (OPS)ని పునరుద్ధరించాలని, 18 నెలల డియర్‌నెస్ అలవెన్స్‌ను విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.

8వ వేతన సంఘం అమలు.. ఎప్పటి నుంచి అంటే..
సాధారణంగా సెంట్రల్ పే కమిషన్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు అలాగే ప్రయోజనాలను సమీక్షించి, సవరణలను సిఫారసు చేస్తుంది. ద్రవ్యోల్బణం, ఇతర బాహ్య కారకాలను దృష్టిలో ఉంచుకుని ఈ సిఫార్సులు చేస్తుంది. 

India GDP Growth: అంచనాలకు మించి.. భారత్ వృద్ధి!!

ఏడవ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరి 28న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేశారు. ఈ పే కమిషన్‌ 2015 నవంబర్ 19న తమ నివేదికను సమర్పించింది. ఆ సిఫార్సులు 2016 జనవరి 1న అమలయ్యాయి. దీని ప్రకారం చూస్తే 8వ పే కమిషన్ 2026 జనవరి 1 నుంచి అమలు కావాలి. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

8వ పే కమిషన్‌ ప్రకటనపై సానుకూలం!
గత వేతన సంఘాన్ని ఫిబ్రవరి నెలలోనే ప్రకటించిన నేపథ్యంలో ఈ సారి పే కమిషన్‌ను ఎన్నికల దృష్ట్యా ఫిబ్రవరిలో 2024 మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించలేదు. పే కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తుండటం, పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న క్రమంలో ఇప్పుడు 8వ పే కమిషన్ ఏర్పాటుపై ఖచ్చితంగా ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.

Financial Year: ఏప్రిల్ 1 నుంచే ఆర్థిక సంవత్సరం ప్రారంభం.. ఎందుకో తెలుసా..?

Published date : 19 Jul 2024 01:39PM

Photo Stories