Skip to main content

Telangana Assembly Budget Sessions Live Updates: కాసేపట్లో తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

Former Chief Minister KCR attending budget presentation  Telangana Assembly Budget Sessions Live Updates  Legislative Council meeting schedule  Assembly session dates  Telangana state cabinet meeting  Approval of Skill University Bill  Job calendar and farmer assurance announcement  Local elections reservation and commission formation

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు 

  • ఉదయం 10 గంటలకు గన్ పార్క్ వద్దకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
  • గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న ఎమ్మెల్యేలు
  • తెలంగాణ రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. శాసనమండలి సమావేశాలు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. 
     
  • సభలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడంతో సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్న సిఎం రేవంత్ రెడ్డి
  • బీఏసీ నిర్వహణ సభ నడిపే రోజులు, ఎజెండా పై చర్చ, ఖరారు
  • ఏడు నుంచి పది రోజులపాటు శాసనసభ నిర్వహించనున్న ప్రభుత్వం
  • రేపు శాసనసభలో రుణమాఫీ పై చర్చించనున్న సర్కార్? మరోవైపు అటు శాసనమండలి ప్రారంభం
  • 25వ తేదీ ఉదయం శాసనసభ హలులో తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం.. బడ్జెట్ ఆమోదం తెలపనున్న మంత్రివర్గం
  • 25వ తేదీన ఉదయం 9 గంటలకు శాసనసభ శాసనమండలిలో వేర్వేరుగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం
  • శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిరోజు సభకు హాజరుకానున్న మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్
  • ఈ శాసనసభ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ బిల్లును ఆమోదం తెలువనున్న రాష్ట్ర ప్రభుత్వం
  • జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధివిధానాలపై శాసనసభలో ప్రకటన చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం
  • లోకల్ ఎలక్షన్స్ రిజర్వేషన్లు, విద్య, వ్యవసాయ కమిషన్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్న సర్కార్
  • తెలంగాణ రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం అంశాలపై సభలో చర్చించనున్న రాష్ట్ర ప్రభుత్వం
Published date : 23 Jul 2024 10:30AM

Photo Stories