First Formula 1: తొలిసారి ఎఫ్1 రేసు విజేతగా నిలిచిన ఆస్కార్
Sakshi Education
మెక్‌లారెన్ జట్టు డ్రైవర్ ఆస్కార్ పియాస్ట్రి తన కెరీర్‌లో తొలిసారి ఫార్ములావన్ (ఎఫ్1) రేసులో విజేతగా నిలిచాడు.
జూలై 21వ తేదీ జరిగిన హంగేరి గ్రాండ్‌ప్రిలో 23 ఏళ్ల ఈ ఆ్రస్టేలియన్ డ్రైవర్ అగ్రస్థానాన్ని పొందాడు.
కెరీర్‌లో 35వ రేసులో పోటీపడ్డ ఆస్కార్ నిర్ణీత 70 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 38 నిమిషాల 01.989 సెకన్లలో పూర్తి చేసి టైటిల్ దక్కించుకున్నాడు. మెక్‌లారెన్‌కే చెందిన లాండో నోరిస్ రెండో స్థానంలో నిలిచాడు.
హామిల్టన్ (మెర్సిడెస్), లెక్‌లెర్క్ (ఫెరారీ), వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి జూలై 28వ తేదీ జరుగుతుంది.
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ సన్నాహాలకు భారీగా నిధులు.. ఖర్చు రూ.470 కోట్లు!!
Published date : 23 Jul 2024 09:32AM