Skip to main content

Union Budget 2024 Live Updates and Highlights: కేంద్ర బడ్జెట్‌ 2024 సమావేశాలు.. అప్‌డేట్స్ ఇవే..

ఆర్థిక సంవత్సరం 2023–24కు సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
Budget 2023-24 announcement by Nirmala Sitharaman Budget 2023-24 announcement by Nirmala Sitharaman   government's fiscal strategy for FY 2023-24 Union Budget 2024 Live Updates In Telugu  Nirmala Sitharaman presenting the annual budget for FY 2023-24

లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. డిజిటల్‌ రూపంలోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మల.

బడ్జెట్ ముఖ్యాంశాలు ఇవే..

 • ఇది ప్రజల బడ్జెట్‌. గత పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ అద్భుత ప్రగతిని సాధిస్తోంది.
 • ప్రధాని మోదీ సారధ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు తీస్తోంది.
 • దేశంలోని ప్రజలందరి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం. 
 • బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి.
 • పదేళ్లలో ఆర్థిక స్థితి ఉన్నత స్థాయికి చేరుకుంది.

వేతన జీవులకు ఊరట

 • కొత్త పన్ను విధానంతో 7లక్షల వరకు పన్ను లేదు.
 • స్టాండర్డ్‌ డిడెక్షన్‌ రూ.50వేల నుంచి 75వేలకు పెంపు.
 • ప్రత్యక్ష పన్నులు మూడు రెట్లు పెరిగాయి. 
 • పన్ను చెల్లింపుదారులకు అభినందనలు. 
 • ఈ ఏడాది రూ.26.02 లక్షల కోట్ల పన్ను ఆదాయం అంచనా.
 • ఫిజికల్‌ డెఫిసిటీ 5.2 శాతానికి తగ్గింపు. 
 • కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గింపు. 
 • ప్రత్యక్ష, పరోక్ష పన్ను విధానంలో మార్పులు లేవు. 
 • ఆదాయపు పన్నుల శ్లాబులు యథాతథం. 
 • 2023-24 ఏడాదికి రెవెన్యూ ఆదాయం రూ.30.08 లక్షల కోట్లు. 
 • ఈ ఏడాది ద్రవ్యలోటు 5.8 శాతం.
 • ఈ ఏడాది అప్పులు రూ.14లక్షల కోట్లు. 
   
 • సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌.. అదే మా మంత్రం. 
 • నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారు.
 • గత పదేళల్లో అందరికీ ఇళ్లు, గ్యాస్‌, నీళ్లు ఇచ్చాం. అవినీతిని గణనీయంగా తగ్గించాం. 
 • శతాబ్ధంలోని అతిపెద్ద సంక్షోభం కోవిడ్‌ను అధిగమించాం.
 • కోవిడ్‌ను అధిగమించి అభివృద్ధి సాధించాం. రాబోయే కాలంలో భారీ మెజార్టీతో విజయం సాధిస్తాం.మా దృష్టిలో జీడీపీ అంటే గవర్నెన్స్‌, డెవలప్‌మెంట్‌, పర్ఫార్మెన్స్‌. 
 • ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయి. 
 • ప్రజల ఆదాయంలో పెరుగుదల ఉంది. 
 • పన్ను సంస్కరణలతో గుణాత్మకమైన పురోగతి సాధించాం. 
 • ద్రవ్యోల్భణాన్ని అరికట్టడంలో విజయం సాధించాం. 
 • పాలనలో పారదర్శకతను పెంచాం. 
Union Budget 2024 Live Updates
 • మూలధన వ్యయం రూ.11.1లక్షల కోట్లకు పెంపు. 
 • ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు ఆయుష్మాన్‌ పథకం వర్తింపు. 
 • రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు. 
 • స్టార్ట్‌ప్‌ల కోసం రూ.43వేల కోట్ల రుణాలు. 
 • టూరిజాన్ని పొత్రహించేందుకు వడ్డీ లేని రుణాలు.
 • దేశంలో కొత్తగా 5 సమీకృత యాక్టివ్‌ పార్కులు. 
 • 30కోట్ల మంది మహిళలకు ముద్రా రుణాలు అందించాం. 
 • 9కోట్ల మంది మహిళలకు ఉపాధి కల్పించాం. 
 • కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇచ్చాం. 
 • రూప్‌ టాప్‌ సోలార్‌ విధానంలో కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు విద్యుత్‌ ఇచ్చాం. 
 • పీఎం విశ్వకర్మ యోజన పథకంతో చేతి వృత్తుల వారిని కాపాడుకుంటున్నాం. 
 • ఆశావర్కర్లు అందరికీ ఆయుష్మాన్‌ భారత్‌. 
 • లక్ష కోట్లతో ప్రైవేట్‌ సెక్టార్‌కి కార్పస్‌ ఫండ్‌. 
 • వైద్యరంగాన్ని బలోపేతం చేస్తున్నాం. 
 • అంగన్‌వాడీ సెంటర్లను అప్‌గ్రేడ్‌ చేశాం. 
 • ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంతో విజయం సాధించాం. 
 • విషన్‌ ఫర్‌ వికసిత్‌ భారత్‌..
 • సుసంపన్నమైన భారత్‌ను ఏర్పాటు చేయడం మా లక్ష్యం.
 • ప్రకృతితో మమేకమై, ఆధునిక మౌలిక సదుపాయాలతో అందరికీ వారి సామర్థ్యానికి తగ్గట్టుగా రాణించేందుకు అవకాశం కల్పించడం మా లక్ష్యం. 
 • అందరి విశ్వాసం చూరగొనడం ద్వారా రానున్న ఐదేళ్లలో అనూహ్యమైన అభివృద్ధి కనిపించనుంది.
 • ఇది 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించేందుకు సువర్ణ సంవత్సరాలుగా మిగలనున్నాయి.
 • పీఎం ఫసల్‌ కింద నాలుగు కోట్ల మంది రైతులకు బీమా అందించాం. 
 • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్భణం, అధిక వడ్డీ. 
 • పీఎం ఆవాస్‌ యోజక కింద మహిళలకు 70వేల గృహాలు అందించాం.
 • యూరప్‌ ఎకనామిక్‌ కారిడార్‌ దేశానికి గేమ్‌ఛేంజర్‌గా మారబోతోంది. 
 •  డెమోగ్రఫీ, డెమొక్రసీ, డైవర్శిటీలకు సబ్‌ కా ప్రయాస్‌ అంటే అందరి ప్రయత్నాలను జోడించడం ద్వారా ప్రతి భారతీయుడి ఆకాంక్షలను నెరవేర్చగలం.
 •  స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ దేశంలో అవకాశాలకు కొదవలేదని,
 • ఆకాశమే హద్దని వ్యాఖ్యానించిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
 •  మా ప్రభుత్వానికి సకాలంలో తగినంత ఆర్థిక వనరులు, టెక్నాలజీలు, శిక్షణ ఇవ్వడం చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అందివ్వడం ప్రాధాన్యమైన అంశం.
 • పంచామృత్‌ లక్ష్యాలకు అనుగుణంగా మరింత సుస్థిరమైన అభివృద్ధిని సాధించేందుకు ప్రయత్నిస్తాం
 • ఇంధన భద్రత, అందరికీ చౌకగా ఇంధనం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 • మూడు ఎకనామిక్‌, లాజిస్టిక్‌ కారిడార్‌లను ఏర్పాటు చేస్తున్నాం. 
 • మూడు మేజర్‌ రైల్వే కారిడార్ల నిర్మాణం జరుగుతోంది. 
 • కొత్త రోడ్‌, రైలు కారిడార్లను అందుబాటులోకి తెలుస్తున్నాం. 
 • 40వేల నార్మల్‌ బోగీలను వందే భారత్‌ మోడల్‌లోకి మారుస్తున్నాం. 
 • పోర్టు కనెక్టివిటీ కారిడార్‌ అభివృద్ధి జరిగింది. 
 • పీఎం గతిశక్తి ద్వారా మల్టీమోడల్‌ కనెక్టివిటీ అభివృద్ధి. 
 • మత్య్స రంగంలో 55 లక్షల ఉద్యోగాలు కల్పించాం. 
 • సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు రెండింతలు పెరిగాయి. 
 • మరిన్ని నగరాలకు మెట్రో రైళ్లను అందిస్తాం. 
 • 517 ప్రాంతాలకు కొత్తగా విమాన సర్వీసులు.

 

 

Union Minister Nirmala Sitharaman presents the Union Interim Budget 2024-25 at the Parliament. pic.twitter.com/ooIT0ztsof

 

► బడ్జెట్‌ సమావేశాలకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ హాజరు.

► అమరావతి ఎంపీ నవనీత్‌ కౌర్‌ బడ్జెట్‌ సమావేశాలకు హాజరు. ఈ బడ్జెట్‌లో ముఖ్యంగా యువత, మహిళలపై ఫోకస్‌ పెట్టినట్టు కామెంట్స్‌

► పార్లమెంట్‌లో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. కాసేపటి క్రితమే ముగిసిన కేబినెట్‌ సమావేశం.

► 2024 మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్.

➢ కేంద్ర కేబినెట్‌ సమావేశం ప్రారంభం
➢ బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్‌
➢ ట్యాక్స్‌ పేయర్లు కొత​ పన్ను విధానాన్ని ఎంచుకొనేలా మార్పులు చేసే అవకాశం

➢ ఇన్‌కంటాక్స్‌ మినహాయింపు పరిమితి రూ. 7 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచే చాన్స్‌
➢ పాత పన్ను విధానంలో వివిధ రకాల మినహాయింపులకు వీలు
➢ ఉద్యోగుల కోసం స్టాండర్డ్‌ డిడక్షన్‌ పరిమితిని రూ. 50 వేల నుంచి రూ. లక్షకు పెంచే చాన్స్‌
➢ విదేశీ ఆదాయంపై ట్యాక్స్‌ రిటర్నుల సవరణలు మరింత సులభతరం చేసే అవకాశం

➢ ఈవీ వాహన లోన్స్‌పై వడ్డీలో రాయితీలు పెంచే అవకాశం

► రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నిర్మలా సీతారామన్‌, ఆర్థిక శాఖ అధికారుల బృందం.
 
► రాష్ట్రపతిభవన్‌కు బయలుదేరిన కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్థిక శాఖ అధికారులు.

► ఆరోసారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్‌. బడ్జెట్‌లో అద్భుత ప్రకటనలు ఆశించవద్దన్న నిర్మల. మరోవైపు.. ఈసారీ బడ్జెట్‌లో ఊరటలు ఉంటాయని నమ్ముతున్న జనం. 

► కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ నేడు పార్లమెంట్‌ ముందుకురానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్‌ భవనంలోని లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

► కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్న నిర్మలా సీతారామన్‌, ఆర్థిక శాఖ అధికారులు.

► కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి మంత్రి నిర్మల చేరుకుంటారు. బడ్జెట్‌ రూపకల్పనలో భాగస్వాములైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారు. ఉదయం 9.30 నిమిషాలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్‌ గురించి వివరించి ఆమె అనుమతిని తీసుకోనున్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు నూతన పార్లమెంట్‌ భవనానికి నిర్మల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల బృందం చేరుకుంటుంది.
► బడ్జెట్‌ సమర్పణకు ముందు ఉదయం పార్లమెంట్‌ ఆవరణలో కేంద్ర మంత్రి మండలి ఒకసారి భేటీకానుంది. ఈ భేటీలోనే మధ్యంతర బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మంత్రి లోక్‌సభలో అడుగుపెడతారు. బడ్జెట్‌ ప్రతులను చదివి ఆయా శాఖలకు నిధుల కేటాయింపులుసహా సమగ్ర బడ్జెట్‌ స్వరూపాన్ని ఆవిష్కరిస్తారు.

► లోక్‌సభలో ఆమె బడ్జెట్‌ ప్రసంగం పూర్తయ్యాక ఆయా పద్దుల ప్రతులను రాజ్యసభలో సభ్యులకు అందజేస్తారు. నిర్మల ఇలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరసగా ఆరోసారి. గురువారం నాటి బడ్జెట్‌తో కలుపు కుని ఐదు పూర్తి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టినవారవుతారు. దీంతో గతంలో మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్‌ పేరిట ఉన్న రికార్డును నిర్మల సమంచేయనున్నారు. మన్మోహన్‌ సింగ్, అరుణ్‌ జైట్లీ, చిదంబరం, యశ్వంత్‌ సిన్హాలు ఐదు సార్లే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

Published date : 01 Feb 2024 12:38PM

Photo Stories