అనంతపురం ఎడ్యుకేషన్: కేజీబీవీ టీచింగ్ పోస్టులకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ నాగరాజు తెలిపారు. జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీలో భాగంగా మెరిట్ ఆధారంగా ఇటీవల ప్రాథమిక అర్హత జాబితాలోని అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిందన్నారు.
KGBV Teacher Posts Counselling
ఆయా పోస్టులకు ఫైనల్‌గా ఎంపికై న అభ్యర్థుల మొబైళ్లకు సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి మెసేజ్‌లు పంపినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అభ్యర్థులు ఈనెల 8న సమగ్రశిక్ష కార్యాలయంలో జరిగే నియామక కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఆధార్) తీసుకురావాలని సూచించారు.