Skip to main content

Contract Jobs: కేజీబీవీల్లో కాంట్రాక్ట్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Contract Jobs Teacher Jobs In KGBV  District Education Officer G. Pagadalamma issuing statement about KGBV contract teaching staff recruitment  Applications invited for contract teaching staff in KGBVs for academic year 2024-25  Eligible female candidates invited to apply for teaching positions in Parvathipuram district KGBVs  Parvathipuram District education recruitment notice for KGBV teaching staff
Contract Jobs Teacher Jobs In KGBV

పార్వతీపురం టౌన్‌: జిల్లాలో నిర్వహిస్తున్న కేజీబీవీల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదకన బోధనా సిబ్బంది కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధిఖారి జి. పగడాలమ్మ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 2024–25 విద్యా సంవత్సర కాలానికి పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

Dussehra Holidays 2024: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం, ఒకరోజు అధికంగా..

ప్రిన్సిపాల్‌–1, పీజీటీ–7, సీఆర్‌టీ–16 పార్ట్‌టైం టీచర్‌–7, వార్డెన్‌–3 మొత్తం 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అక్టోబరు 10 వరకు అన్‌లైన్‌లో ఏపీకేజీబీవీ.ఏపీసీఎఫ్‌ఎస్‌స్‌లో నమోదు చేసుకోవచ్చని సూచించారు.

PG Courses Admissions: వైద్య విద్య పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. చివరి తేదీ ఇదే

18–42 వయస్సు మధ్య గల మహిళలు అర్హులని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, మాజీ సైనిక ఉద్యోగులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవ త్సరాలు పయోపరిమితిలో సడలింపు ఉందని తెలిపారు. సబ్జెక్టు, రోస్టర్‌, పోస్టులు, గేరవ వేతనం, విద్యార్హత వివరాలను వెబ్‌సైట్‌లో గమనించాలని కోరారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 28 Sep 2024 03:23PM

Photo Stories