Skip to main content

Teaching and Non Teaching Jobs : కేజీబీవీల్లో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యా శాఖ) ఆధ్వర్యంలో.. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఏడాది కాలానికి టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Teaching and non teaching posts at KGBVs  Kasturba Gandhi Girls Vidyalaya recruitment announcement  Applications for teaching and non-teaching posts at KGBV  KGBV outsourcing teaching posts  KGBV job openings for academic year 2024-25

»    మొత్తం పోస్టుల సంఖ్య: 604.
»    పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్‌–10, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ)–165, కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ టీచర్‌(సీఆర్‌టీ)–163, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ)–04, పార్ట్‌ టైం టీచర్‌(పీటీటీ)–165, వార్డెన్‌–53, అకౌంటెంట్‌–44.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ, యూజీడీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: ఓపెన్‌ కేటగిరి అభ్యర్థులకు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)
»    వేతనం: నెలకు ప్రిన్సిపల్‌కు రూ.34,139, పీజీటీకి రూ.26,759, సీఆర్టీకి రూ.26,759, పీఈటీకి రూ.26,759, అకౌంటెంట్‌కు రూ.రూ.18,500, వార్డెన్‌కు రూ.18,500, పార్ట్‌ టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.18,500.
»    ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, సర్వీస్‌ వెయిటేజీ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ముఖ్య సమాచారం:
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.10.2024.
»    వెబ్‌సైట్‌: https://apkgbv.apcfss.in/

Ratan Tata: దిగ్గజ పారిశ్రామికవేత్త 'రతన్‌ టాటా' కన్నుమూత 

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 10 Oct 2024 12:09PM

Photo Stories