AP EAPCET 2024 Counselling: ఏపీఈఏపీ సెట్ చివరి విడత కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్ విడుదల
ఎచ్చెర్ల : ఏపీ ఈఏపీసెట్ –2024 ఎంపీసీ స్ట్రీమ్ చివరి విడత (మూడో విడత) కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యా మండలి, సాంకేతిక విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి చేశారు. విద్యార్థులకు మూడో కౌన్సెలింగ్‌లో మరో అవకాశం కల్పిస్తున్నారు. ఏపీఈఏపీ సెట్ ర్యాంకు వచ్చి గతంలో కౌన్సెలింగ్‌కు హాజరు కాని వి ద్యార్థులకు మరో అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం కళాశాలల్లో సీటు లభించిన విద్యార్థులకు కళాశాల, బ్రాంచ్ మార్చుకునే అవకాశం లభిస్తుంది.
Also Read: BRAOU Degree and PG Courses Admissions 2024-25
శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్, సహాయ కేంద్రం సమన్వయ కర్త గురుగుబెల్లి దామోదర్‌రావు తెలిపారు. కౌన్సెలింగ్‌లో సమస్యలు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో సమస్యలు ఉంటే సంప్రదించాలని సూచించారు. షెడ్యూల్ మేరకు ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఫీజు చెల్లింపు, రిజస్ట్రేషన్, సర్టిఫికెట్ ఆన్‌లైన్ వెరిఫికేషన్, 22 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం, 23న ఆప్షన్ల మార్పు, 26న అలాట్‌మెంట్‌ల ప్రకటన, 30లోపు కళాశాలలకు సెల్ఫ్ రిపోర్టు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో నాలుగు ఇంజినీరింగ్ కాలేజ్‌లు ఉండగా, మొత్తం సీట్లు 2154 కాగా, 1903 ప్రవేశాలు జరిగాయి. 252 సీట్లు ఖాళీలు ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో 30 శాతం సీట్లకు మేనేజ్‌మెంట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు.
Tags
- EAPCET Final Phase Of Counselling
- AP EAPCET -2024
- AP EAMCET -2024 Final Phase Counselling
- AP EAPCET News
- Final Phase Counselling-2024
- AP Web Final Phase Counselling Schedule Dates 2024
- AP EAPCET 2024 Counselling Schedule
- AP EAPCET 2024 Counselling
- AP EAPCET web counselling
- AP EAPCET 2024Final Phase Counselling MPC Stream