Skip to main content

BRAOU Degree and PG Courses Admissions 2024-25 : ఈ ఏడాది ఏపీ విద్యార్థుల‌కు నిరాశే..దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ ప్రవేశాల్లేవ్‌.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌లే తెలంగాణ‌లో దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ ప్ర‌వేశాలుకు అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
BRAOU Degree and PG Courses No Admissions 2024-25 Problems  Ambedkar Universal University distance education notification  Telangana degree and PG admissions announcement  AP notification halts admissions for Telangana students  Deadline for Telangana students to apply for distance education courses  August 31 application deadline for degree and PG courses in Telangana

గ‌తంలో రెండు రాష్ట్రాల‌కు ఈ నోటిఫికేష‌న్ వ‌ర్తించేంది. రెండు రాష్ట్రాల విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు. కానీ ఇప్ప‌డు తాజాగా ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు నిలిపివేస్తూ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరే తెలంగాణ విద్యార్థులు ఆగస్టు 31లోపు దరఖాస్తు చేసుకోవాలని అందులో పేర్కొంది. అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో గత విద్యా సంవత్సరం మూడేళ్ల డిగ్రీ కోర్సులో 1.54 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 70% మంది తెలంగాణ, 30% మంది ఏపీ వారున్నారు. గతేడాది 48,600 మంది ప్రథమ సంవత్సరంలో చేరారు. 

ఏపీకి మాత్రం..
ఈ విద్యాసంవత్సరానికి ఏపీ వారికీ ప్రవేశాలు కల్పించాలంటూ ఆ రాష్ట్ర ఉన్నత విద్య అధికారులు కొద్దిరోజుల క్రితం కోరడంతో వర్సిటీ అధికారులు గతంలో ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారు. కానీ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. 

ఏపీ ప్రభుత్వం అభ్యర్థిస్తే.. 
ప్ర‌స్తుత ఏపీ ప్ర‌భ‌త్వం అభ‌ర్థిస్తే.. నోటిఫికేషన్‌లో మార్పులు చేస్తామని వర్సిటీ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నిర్ణయం కూడా వేగంగా తీసుకుంటేనే అక్కడి విద్యార్థులకు ఉప‌యోగం ఉంటుంది.

Published date : 17 Aug 2024 03:00PM

Photo Stories