Jagananna Vidya Devena Scheme: 13,578 మందికి జగనన్న విద్యాదీవెన
● రూ.6.70 కోట్ల మేర లబ్ధి
● విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
● సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా నగరి నుంచి జగనన్న విద్యాదీవెన నగదు జమ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. స్థానిక కలెక్టరేట్‌లో సీఎం ప్రసంగం వీక్షించే కార్యక్రమాన్ని అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. కలెక్టర్‌తో పాటు పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఎస్టీ కమిషన్ సభ్యుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లులు వీక్షించారు.
Also read: Education for All: CM Jagan's Address on Jagananna Vidya Deevena at Nagari #sakshieducation
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 13,578 మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతల్లో రూ.6.70 కోట్లను ముఖ్యమంత్రి జమచేశారన్నారు. జిల్లాలో గిరిజన విద్యార్థులు 11,477 మందికి రూ.5కోట్ల 37లక్షల 50వేల 761లు, ఎస్సీ విద్యార్థులు 319 మందికి రూ.21లక్షల 57 వేలు, బీసీ, ఈబీసీ, కాపు విద్యార్థులు 1729 మందికి రూ.కోటి 6లక్షల 64వేలు, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీకి చెందిన 53 మందికి రూ.4లక్షల 31వేల 267లు జమ అయినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ప్రభుత్వం అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని కోరారు.
Also read: CM Jagan Disburses Funds for Jagananna Vidya Deevena Scheme at Nagari Meeting #sakshieducation
అనంతరం విద్యార్థుల తల్లులకు విద్యాదీవెన చెక్కును వారితోపాటు ఎస్టీ కమిషన్ సభ్యుడు విశ్వేశ్వరరాజు చేతులమీదుగా అందజేశారు. గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు, ఏటీడబ్ల్యూవో ఎల్.రజని, చింతలవీధి ఎంపీటీసీ గిడ్డి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Also read: Nadu Nedu: Revolutionizing AP Govt Schools with AI Technology #sakshieducation