Skip to main content

Education News:టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ

Global competition for Times Higher Education rankings increases in 2024   Education News:టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ
Education News:టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా పోటీ

ప్రతిష్టాత్మక ‘టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ ర్యాంకింగ్స్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల నుంచి పోటీ పెరుగుతోంది. గతేడాది కంటే అత్యధికంగా ‘ఇంపాక్ట్‌’ ర్యాంకులకు ప్రతిపాదనలు వెల్లువెత్తగా మన దేశం నుంచి ఎక్కువ విద్యా సంస్థలు దరఖాస్తు చేయడం విశేషం. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రెండు వేలకు పైగా విద్యాసంస్థలు ర్యాంకులు పొందగా ఈ ఏడాది దరఖాస్తుల్లో 18 శాతం పెరుగుదల నమోదైంది. ఈసారి 130 దేశాల నుంచి సుమారు 2,540 విశ్వవిద్యాలయాలు డేటాను సమర్పించాయి. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా వర్సిటీల పనితీరును పరిశీలించి ర్యాంకులు అందిస్తున్నారు.

సగానికిపైగా ఆసియా నుంచే..
టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఇంపాక్ట్‌ ర్యాంకుల కోసం పోటీ పడుతున్న విద్యాసంస్థలు ఆసి­యా­లోనే అధికంగా ఉన్నాయి. ప్రతిపాదనల్లో సగానికిపైగా ఆసియా నుంచే వచ్చాయి. భారత్‌ 148 విద్యా సంస్థల నుంచి ప్రతిపాదనలతో అగ్రస్థానంలో నిలి­చింది. పాకిస్తాన్‌ 127 విద్యా సంస్థల నుంచి ప్రతిపాదనలతో రెండో స్థానంలో ఉండగా 121 విద్యా సంస్థలతో ఫిలిప్పీన్స్‌ మూడో స్థానంలో ఉంది. అంగోలా, అజర్‌బైజాన్, చైనా, ఇండోనేషియా, కెన్యా, లిబియా నుంచి కూడా ఎక్కువ ప్రతిపాదనలు అందాయి. బెనిన్, బోట్సా్వనా, బుర్కినా ఫాసో, ఎల్‌ సాల్వడార్, ఎస్టోనియా, మాల్దీవులు, నమీ­బియా, పాపువా న్యూ గినియా, సెనెగల్, జింబాబ్వే మొదటి సారిగా ప్రతిపాదనలతో సిద్ధమయ్యాయి.

times1

నాణ్యమైన విద్య..
సుస్థిరాభివృద్ధి లక్ష్యానికి అనుగుణంగా ‘నాణ్యమైన విద్య’ విభాగంలో అత్యధిక ప్రతిపాదనలు వచ్చి­నట్లు ‘టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’ ప్రకటించింది. ఇందులో ఏకంగా 1,991 విశ్వవిద్యాలయాలు డేటా­ను అందించాయి. ‘మంచి ఆరోగ్యం–శ్రేయస్సు’ విభాగంలో 1,801 సంస్థలు పోటీ పడగా ‘లింగ సమానత్వం’లో 1,566 విద్యా సంస్థలున్నాయి. ఈ 3 లక్ష్యాలకు అనుగుణంగా గత నాలుగేళ్లుగా అత్యధికంగా ప్రతిపాదనలు వస్తుండటం గమనార్హం. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జూన్‌ 16–19వ తేదీలలో జరిగే గ్లోబల్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ కాంగ్రెస్‌లో ఇంపాక్ట్‌ ర్యాంకింగ్స్‌ ప్రకటించనున్నారు.

మరింత చదవండి : Breaking News: ఆంధ్రప్రదేశ్‌లో 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన తాజా సమాచారం

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 31 Jan 2025 11:21AM

Photo Stories