JNTUA Mistake: జేఎన్‌టీయూ పరీక్షల విభాగం పొరపాటు – 193 మంది విద్యార్థుల జవాబు పత్రాల గల్లంతు!

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరీక్షల విభాగంలో జరిగిన పొరపాటు వాస్తవమేనని అధికారులు లిఖితపూర్వకంగా అంగీకరించారు. జవాబు పత్రాలు గల్లంతైన ఘటన పై బుధవారం ‘సాక్షి’ పత్రికలో ‘జవాబు పత్రాలకు రెక్కలు’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో జేఎన్‌టీయూ లో కలకలం రేగింది.
అయితే, పరీక్షల విభాగం నష్టాన్ని పరిహరించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ క్రమంలో ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాగప్రసాద్ నాయుడు లిఖితపూర్వక వివరణ ఇచ్చారు. ఆయన ప్రకారం, బీటెక్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థుల జవాబు పత్రాలు పొరపాటున మిళితం అయ్యాయి. ఈ గుర్తింపులో కొంత ఆలస్యమైందని, పొరపాటు జరిగిందంటూనే, కట్టుదిట్టంగా, పకడ్బందీగా ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Btech EEE Branch Advantages : ఇంజనీరింగ్‌లో 'EEE' బ్రాంచ్ తీసుకోవడం ద్వారా.. లాభాలు ఇవే..!
దీంతో పాటు, మూల్యాంకనం, జవాబు పత్రాల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుకుంటున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)