JEE Main 2025 Exam Schedule: జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్ష షెడ్యూల్ ఇదీ.. 19వ తేదీ నుంచి హాల్‌టికెట్లు..
జనవరి 22నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు జనవరి 19వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని ఎన్‌టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులు jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను కూడా ఇదే విధానంలో తీసుకోవాలని కోరింది.
సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను ఈ వారంలోనే ఆన్‌లైన్‌లో పెట్టనున్న ట్లు వెల్లడించింది. విద్యార్థులకు ప రీక్ష కేంద్రం ఏ నగరంలో పడిందో తెలిపేదే సిటీ ఇంటిమేషన్ స్లిప్. ఇది అడ్మిట్ కార్డు కాదు.. అడ్మిట్ కార్డులు 19 నుంచి అందుబాటులో ఉంటాయి. జేఈఈ మెయిన్ పరీక్షను తెలుగు సహా మొత్తం 13 భా షల్లో నిర్వహిస్తున్నారు. మొదటి సె షన్ కోసం దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 13.8 లక్షల మంది రిజి స్టర్ చేసుకొన్నారు. గత ఏడాదితో పోల్చితే ఇది 1.6 లక్షలు అధికం.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | వీడియోస్
పరీక్ష షెడ్యూల్ ఇదీ.
పేపర్: బీఈ/బీటెక్
పరీక్ష తేదీలు: జనవరి 22, 23, 24, 28, 29
షిప్టులు: మొదటి షిప్టు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు
పేపర్: 2ఏ (బీ ఆర్క్), 2బీ (బీ ప్లానింగ్), 2ఏ–2బీ (బీ ఆర్క్– బీ ప్లానింగ్)
పరీక్ష తేదీ: జనవరి 30
షిప్టు: మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు.
Tags
- JEE Main First Session
- Btech
- BE Engineering Courses
- NTA JEE Main 2025 Exam Dates Session 1
- JEE Main 2025 Schedule Released
- JEE Main 2025 January session exam schedule
- NTA JEE Mains 2025
- JEE Mains 2025 Exam Date
- JEE Main 2025 registration begins
- JEE Main 2025 Session 1
- JEE Mains 2025 syllabus
- JEE Mains 2025 exam date Session 1
- JEE Main 2025 Hall Tickets
- JEE2025
- JEEHallTickets
- JEEExamDates
- ComputerBasedTest
- EngineeringAdmissions
- JEEHallTicketDownload