Skip to main content

Job Calendar 2024 : అసెంబ్లీ స‌మావ‌వేశంలో జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌ట‌న‌.. సివిల్స్ ప్రిలిమ్స్ ఉత్తీర్ణుల‌కు..!

అసెంబ్లీ సమావేశం త్వ‌ర‌లో ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ జాబ్‌ క్యాలెండర్‌ను కూడా అదే స‌మావేశంలో ప్రకటిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
Announcement of Job Calendar in the assembly session

ఏటా మార్చిలోగా అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలు సేకరించి జూన్‌ 2లోగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి డిసెంబరు 9లోగా నియామకాలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. శనివారం ప్రజాభవన్‌లో ‘రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం’ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా 2023లో తెలంగాణ నుంచి సివిల్స్‌కు ఎంపికైన 35 మందిని, ఐఎఫ్‌ఎస్‌కు ఎంపికైన ఆరుగురిని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.

Gurukul School Inspection : గురుకుల పాఠ‌శాల‌లో కలెక్ట‌ర్ త‌నిఖీ.. విద్యార్థుల‌తో క‌లిసి భోజ‌నం చేస్తూ..!

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణులకు ఈ ఏడాది (2024) సింగరేణి సంస్థ తరపున రూ.లక్ష చొప్పున సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరాం పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘‘నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యం. గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది. నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేశామ‌ని తెలిపారు.

Good News for Unemployed : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ శాఖలో జాబ్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అర్హ‌త వీరికే!

అయితే, ఈసారి పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్థంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణులకు ఆర్థిక సాయం అందిస్తున్న సింగరేణికి అభినందనలు తెలియ‌జేశారు. సివిల్స్‌లో తెలంగాణ జెండా ఎగరేసి జాతీయ స్థాయిలో సత్తా చాటాలని కోరారు. అంతేకాకుండా, ప్రిలిమ్స్‌ విజేతలు మెయిన్స్‌ కోచింగ్‌ కోసం అవసరమైన స్టడీ మెటీరియల్‌ కోసం, హాస్టల్‌ ఖర్చులు, మెరుగైన శిక్షణ కోసం ఉపయోగపడేలా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామ‌న్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ నుంచి మరింతమంది నిరుద్యోగులు సివిల్స్‌కు ప్రయత్నించాలని చెప్పారు.

Sixth Class Admissions : ఆరో త‌ర‌గ‌తిలో ప్ర‌వేశానికి జ‌వహార్ న‌వోద‌య విద్యాల‌యాల్లో ద‌ర‌ఖాస్తులు..

Published date : 21 Jul 2024 02:51PM

Photo Stories