Skip to main content

Good News for Unemployed : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ శాఖలో జాబ్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అర్హ‌త వీరికే!

Good news for Telangana unemployed as the job notification released  Telangana Government Recruitment Notification for Handloom and Textile Department  Commissioner Shailaja Ramayar Announces Job Openings in Handloom and Textile Department  Recruitment Advertisement for Cluster Development Executives and Textile Designer

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. చేనేత, జౌళి శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఆ శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్ తాజాగా కీలక ప్రకటన విడుదల చేశారు. క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నట్లు చెప్పారు.

Sixth Class Admissions : ఆరో త‌ర‌గ‌తిలో ప్ర‌వేశానికి జ‌వహార్ న‌వోద‌య విద్యాల‌యాల్లో ద‌ర‌ఖాస్తులు..

ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక పద్ధతిలో మూడేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో వివ‌రించారు. పోస్టుల వివ‌రాలు.. క్లస్టర్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్స్, టెక్స్‌టైల్ డిజైనర్ (22).. ఇలా పూర్తిగా 30 పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు జౌళి శాఖ క‌మిష‌న‌ర్ శైల‌జా. అయితే, ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు  IIHT నుంచి చేనేత టెక్నాలజీ (DTH )లో డిప్లొమా హోల్డర్లు అర్హుల‌ని, వీరు ఈ పోస్టుల‌ల్లో అప్లై చేసుకోవాలని శైలజా రామయ్యార్ తెలిపారు. అభ్యర్థులు మ‌రిన్ని వివరాలను తెలుసుకునేందుకు tsht.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల‌ని ఆమె సూచించారు.

School Holidays : భారీ వ‌ర్షాల కార‌ణంగా విద్యా సంస్థ‌ల‌కు సోమ‌వారం కూడా సెల‌వు..!

Published date : 22 Jul 2024 09:03AM

Photo Stories