Skip to main content

Gurukul School Inspection : గురుకుల పాఠ‌శాల‌లో కలెక్ట‌ర్ త‌నిఖీ.. విద్యార్థుల‌తో క‌లిసి భోజ‌నం చేస్తూ..!

Collector inspects gurukul school and had lunch with students

మండ‌లంలోని సాంఘిక సంక్షేమ గురుకుల రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లో జిల్లా క‌లెక్ట‌ర్ బాధావ‌త్ సంతోష్ ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ నేప‌థ్యంలో పాఠ‌శాల‌లోని సౌక‌ర్యాలు, విద్యా నాణ్య‌త, భోజ‌న వ‌స‌తులు వంటి విష‌యాల గురించి ఉపాధ్యాయుల‌ను, విద్యార్థుల‌ను అడిగి తెలుసుకున్నారు. భోజ‌న స‌మ‌యంలో విద్యార్థుల‌తో కోర్చుని తింటూ వారితో చ‌ర్చించారు. భోజ‌న వ‌స‌తులు, వారికి అందుతున్న విద్య‌, త‌దిత‌ర సౌక‌ర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

Good News for Unemployed : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ శాఖలో జాబ్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అర్హ‌త వీరికే!

విద్యార్థులకు అందే రోజూవారి భోజ‌నానికి సంబంధించిన మెను గురించి ఆరాతీసారు. అలాగే, విద్యార్థులు గొప్ప‌గా చ‌దివి ఉన్నత స్థానాల‌కు చేరాల‌ని సూచించారు. ఈ వ‌య‌సు నుంచే వారు క్ర‌మ శిక్ష‌ణ‌తో పెరగాల‌ని వివ‌రించారు. ఇందులో క‌లెక్ట‌ర్‌తోపాటు గురుకుల పాఠ‌శాల ప్రిన్సిపాల్ సుమ‌ల‌త, త‌దిత‌ర అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.

Published date : 21 Jul 2024 02:20PM

Photo Stories