Parvathy Gopakumar: ఒంటి చేతితో విజయం.. సవాళ్లను అధిగమించి విజయం సాధించిన స్ఫూర్తిదాయక మహిళ ఈమె..
2023లో UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో 282వ ర్యాంక్ సాధించడం ద్వారా ఆమె అద్భుతమైన ధైర్యాన్ని, సంకల్పశక్తిని చాటుకుంది.
పార్వతి చిన్నతనంలోనే ఎదుర్కొన్న కష్టాలు ఆమెను మరింత దృఢంగా మార్చాయి. తన తల్లిదండ్రుల మద్దతుతో, ఆమె ఎడమ చేత్తో రాయడం నేర్చుకుంది మరియు చదువులో రాణించింది.
బెంగళూరు నేషనల్ లా స్కూల్ లో చదువుతున్నప్పుడు, పార్వతి కలెక్టర్ కావాలని నిర్ణయించుకుంది. 2022లో తన మొదటి ప్రయత్నంలో UPSC ప్రిలిమ్స్ దాటలేకపోయినప్పటికీ, 2023లో ఓపికతో కష్టపడి చివరికి విజయం సాధించింది.
ఆమె ముఖ్యమైన విషయాలు..
➤ ఆమె కేరళకు చెందినది.
➤ ఆమె 2010లో 7వ తరగతిలో కారు ప్రమాదంలో కుడిచేయి కోల్పోయింది.
➤ ఆమె బెంగళూరు నేషనల్ లా స్కూల్ లో చట్టం చదువుకుంది.
➤ 2023 UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలో 282వ ర్యాంక్ సాధించింది.
➤ ఐ.ఏ.ఎస్ అయ్యాక దివ్యాంగుల హక్కుల కోసం పని చేయాలని ఆమె ఆకాంక్షిస్తుంది.
‘నాకు దివ్యాంగులు అనే పదం నచ్చదు. అందులో ఏదో బుజ్జగింపు ఉంటుంది. వికలాంగులను వికలాంగులుగానే పిలుస్తూ సమాన గౌరవం ఇవ్వాలి. చేయి కోల్పోయాక నా జీవితమే మారిపోయింది. జనం వికలాంగులతో ఎంతో మొరటుగా వ్యవహరిస్తారు. నువ్వు బ్రా ఎలా వేసుకుంటావు, ప్యాడ్ ఎలా పెట్టుకుంటావు అని అడిగినవారు కూడా ఉన్నారు’ అని చెబుతుంది పార్వతి.
మహిళా దివ్యాంగుల కోసం
ఐ.ఏ.ఎస్ అయ్యాక దివ్యాంగుల కోసం, ముఖ్యంగా మహిళా దివ్యాంగుల కోసం పని చేయాలనుకుంటోంది పార్వతి. ‘ప్రేమలో పడి శారీరక వాంఛను వ్యక్తం చేసే దివ్యాంగుల సినిమాలు మీరెప్పుడైనా చూశారా? దివ్యాంగులకు ప్రేమ ఏమిటి అనే ధోరణి మనది. ఇక మహిళా దివ్యాంగులైతే పెళ్లి చేసుకుని భర్త ఎదుట ఆత్మన్యూనతతో ఉండేలా తయారు చేశారు. శారీరక లోపం శరీరానికి సంబంధించింది. మేము పొందాల్సిన ప్రేమ, గౌరవం, లైంగిక జీవితం పట్ల మాకు సమాన హక్కు ఉంది. కొందరు అబ్బాయిలు మమ్మల్ని ప్రేమించి ఉద్ధరిస్తున్నామనుకుంటారు. ఇందులో ఉద్ధరణ ఏమీ లేదు. మేము కూడా సమాన మనుషులమే. అందరిలాగే మేము కూడా’ అంటోంది ఆమె.
UPSC Topper: యూపీఎస్సీ టాపర్‌పై 'ఆనంద్ మహీంద్రా' ప్రశంసల జల్లు.. ఎమన్నారంటే..!
Tags
- Kerala woman
- Parvathy Gopakumar
- UPSC Civil Services exam 2023
- IAS Officer
- UPSC results
- UPSC Civil Services Results 2023
- UPSC exam success
- SakshiEducationUpdates
- Sakshi Education News
- Kerala Woman Clear UPSC Exam
- Woman Clear UPSC Exam
- UPSC Civil Services Examination
- Overcoming adversity
- inspirational story
- achievement