Layoffs: ప్రమాదంలో ఐటీ ఉద్యోగుల భవిష్యత్.. 98% పెరిగిన ఉద్యోగుల తొలగింపులు.. ఎక్కడంటే..!
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోతుంది. ముఖ్యంగా జాబ్ మార్కెట్ వీటి ప్రభావం ఎక్కువగా పడింది. ఫలితంగా చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బడా బడా టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. దీంతో 2024 జాబ్ మార్కెట్ మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
2022లో అమెరికన్ కంపెనీలు 363,832 మందిని విధుల నుంచి తొలగించగా.. గత ఏడాది అత్యధికంగా 98 శాతంతో 7,21,677 మందికి ఉద్వాసన పలికాయి. వాటిల్లో 1,68,032 మంది మెటా, అమెజాన్ ఉద్యోగులు ఉన్నారు. ఈ మెత్తం 2022 కంటే 2023లో 73 శాతంగా ఉందని అమెరికా ప్రముఖ స్టాఫింగ్ సంస్థ ‘ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్’ తెలిపింది.
ఈ సందర్భంగా ‘లేబర్ కాస్ట్ ఎక్కువ. కాబట్టే ఈఏడాది సైతం సంస్థలు పొదుపు మంత్రం జపిస్తున్నాయి. క్యూ1లో నియామకాలు తగ్గించి.. ఉద్యోగులపై కోత విధించేందుకు సిద్ధంగా ఉన్నాయని’ ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండీ ఛాలెంజర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Google Meet Call: ఊడిన ఉద్యోగాలు.. రెండు నిమిషాల్లో 200 మందికి గుడ్‌బై చెప్పిన కంపెనీ..!
టెక్ కంపెనీల్లో ఎక్కువే...
టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు ఎక్కువగా ఉంటాయని, అందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించడమే అందుకు కారణమని అన్నారు. 2023లో రీటైల్ కంపెనీల్లో 78,840 మందిని తొలగించాయి. ఈ మొత్తం అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ మొత్తం 274 శాతం పెరిగినట్లు నివేదిక పేర్కొంది.
టెక్నాలజీ తర్వాత ఈ విభాగాల్లో తొలగింపులే..
ఈ ఏడాది మొత్తం సంస్థలు ఆర్ధిక సామర్ధ్యాలకు అనుగుణంగా ఉద్యోగుల్ని నియమించుకునేలా కసరత్తు చేస్తున్నట్లు ఛాలెంజర్ చెప్పారు. రీటైల్ తర్వాత హెల్త్‌కేర్, ప్రొడక్ట్ మ్యానిఫ్యాక్చరర్, హాస్పిటల్స్ సైతం ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని, పైన పేర్కొన్న విభాగాల్లో లేఆఫ్స్ 2022 కంటే 2023లో 91 శాతం ఎక్కువగా ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదిక హైలెట్ చేసింది.
Layoffs In 2023: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల ఊచకోత.. కొన్ని లక్షల మందిని ఇంటికి పంపిన కంపెనీలు ఇవే.. కారణం ఏమిటంటే..!
Tags
- US layoffs
- US job market
- Layoffs in 2023
- Layoffs in 2024
- Layoffs surged 98% in 2023
- US Companies Layoff
- Challenger
- Gray & Christmas
- usa
- Job Cuts
- Layoffs
- US companies Layoffs
- Meta
- Amazon
- AmericaJobs
- JobMarket
- TechCompanies
- JobMarketImpact
- International news
- it jobs layoff
- Sakshi Education Latest News