David Perdue: చైనాలో అమెరికా రాయబారిగా మాజీ సెనెటర్ డేవిడ్ పెర్డ్యూ
Sakshi Education
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే చైనా, మెక్సికో, కెనడాపై 25% అదనపు సుంకాలు విధిస్తానని ప్రకటించారు.
ఈ నిర్ణయం ప్రకారం.. ట్రంప్ మరింత దృఢంగా చైనా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు చైనా వ్యతిరేకిగా ముద్రపడిన మాజీ సెనెటర్, మాజీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ ఆల్ఫ్రెడ్ పెర్డ్యూను చైనాకు అమెరికా రాయబారిగా నియమించాలని నిర్ణయించారు.
డేవిడ్ పెర్డ్యూ అనుభవం ఉన్న నిపుణుడు, చైనాతో అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తారని ట్రంప్ ప్రకటించారు. జార్జియా గవర్నర్ పదవికి 2022లో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన పెర్డ్యూ ఓటమి పాలయ్యారు. సెనెటర్‌గా ఉన్న సమయంలో.. ఆయన చైనా సహా ఇతర దేశాల నుంచి ఎదురయ్యే ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అమెరికా నావికాదళ శక్తిని బలోపేతం చేయాలని సూచించారు.
Kashyap Patel: ‘ఎఫ్‌బీఐ’ డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్.. అమెరికాలో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి
Published date : 09 Dec 2024 10:43AM