Attractive Cities: ప్రపంచంలోనే ఆకర్షణీయమైన నగరం పారిస్.. టాప్ 100లో భారత్ నుంచి ఒకే సిటీ!
ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన నగరంగా పారిస్ నిలిచింది. ఇది 2024లో వరుసగా నాలుగోసారి ఈ గౌరవం పొందింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ రెండో స్థానంలో నిలిచింది. తరువాత జపాన్ రాజధాని టోక్యో మూడో స్థానంలో ఉంది.
ఈ జాబితాలో భారత్ నుంచి ఢిల్లీ ఒక్కటే 74వ స్థానంలో చోటు దక్కించుకుంది. ఇతర ప్రధాన నగరాల్లో రోమ్, మిలన్, న్యూయార్క్, ఆమ్‌స్టర్‌డామ్, సిడ్నీ, సింగపూర్, బార్సిలోనా ఉన్నాయి.
డేటా అనలిటిక్స్ కంపెనీ యూరోమానిటర్ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, నగరాలను ఎన్నుకోవడంలో ఆర్థిక, వ్యాపార పనితీరు, పర్యాటక పనితీరు, మౌలిక సదుపాయాలు, పర్యాటక విధానం, ఆకర్షణ, ఆరోగ్యం, భద్రత, స్థిరత్వం వంటి అంశాలు ప్రధానంగా పరిగణించబడ్డాయి. జాబితాలో 98వ స్థానంలో జెరూసలేం, 99వ స్థానంలో జుహై, 100వ స్థానంలో కైరో ఉన్నాయి.
Climate Change: వాతావరణ మార్పుల సూచీలో 10వ స్థానంలో భారత్.. మొదట ఉన్న దేశాలు..