Skip to main content

Telangana Constable Success Story : తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు.. అన్నావదిన సహాయంతోనే కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టానిలా..

తెలంగాణ పోలీస్‌ నియామకబోర్డు అక్టోబ‌ర్ 4వ తేదీన విడుద‌ల చేసిన కానిస్టేబుల్‌ తుది ఫ‌లితాలు విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
Telangana Constable Success Telugu
రాజశేఖర్

ఈ ఫ‌లితాల్లో ఎంద‌రో పేదింటి బిడ్డ‌లు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. ఈ నేప‌థ్యంలో రాజశేఖర్ ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొని అనుకున్న కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు.

కుటుంబ నేప‌థ్యం :
తెలంగాణ‌లోని జగిత్యాల జిల్లాకు దట్నూర్‌కు చెందిన.. పారిపెల్లి నారాయణ–లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు చిరంజీవి, రాజశేఖర్‌. తల్లిదండ్రులిద్దరూ గతంలోనే చనిపోయారు. దీంతో తమ్ముడి బాధ్యత అన్న చిరంజీవిపై పడింది. ఎకరం పొలం సాగు చేస్తూ అతన్ని ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ చదివించాడు.

సాధించిన ఉద్యోగాలు..
రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తూనే ఏడాది క్రితం సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కోర్టు కేసు ఉండటంతో ఖాళీగా ఉండలేక సివిల్‌ కానిస్టేబుల్‌ పరీక్ష రాసి, ఎంపికయ్యాడు. గ్రూప్‌–1, గ్రూప్‌–2 కూడా రాస్తానని, డిప్యూటీ కలెక్టర్‌ కావడం తమ లక్ష్యమని తెలిపాడు. అన్నావదిన దీవెనల వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని అన్నాడు. అలాగే.. ఈ సారి తెలంగాణ కానిస్టేబుల్‌ తుది ఫ‌లితాల్లో చాలా కుటుంబాల్లో విచిత్రంగా ఇద్ద‌రు, ముగ్గురు, న‌లుగురు చొప్పున చాలా చోట్ల ఉద్యోగాలు సాధించారు.

☛ TS Constable Jobs : తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫ‌లితాల్లో.. ఒకే ఇంట్లో నుంచి నలుగురు సెలెక్ట్ అయ్యారిలా.. ఇంకా చాలా కుటుంబాల్లో..

ఎంపికైన అభ్యర్థులు ముందుగా..
ఇక ఎంపికైన అభ్యర్థుల ప్రవర్తన, పూర్వాపరాలు పరిశీలనతో పాటు వైద్యపరీక్షలు జరగాల్సి ఉంది. ఎంపికైన అభ్యర్థులు ముందుగా తమ ధ్రువీకరణపత్రాలపై గెజిటెడ్ అధికారుల సంతకాలతో కూడిన అటెస్టేషన్ పత్రాలను అక్టోబ‌ర్ 13వ తేదీలోగా సమర్పించాల్సి ఉంది.

ధ్రువపత్రాల పరిశీలన‌..
ఇదే సమయంలో గతంలో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్దుల ధ్రువపత్రాల పరిశీలన జరిగిన 18 కేంద్రాల నుంచి ఆయా యూనిట్ల అధికారులు ఎంపికైన అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను తెప్పించుకోనున్నారు. ముందుగా సమర్పించిన పత్రాలతో అటెస్టేషన్ పత్రాలను సరిపోల్చి పరిశీలించడంతో పాటు అభ్యర్థులకు ఏదైనా నేరచరిత్ర ఉందా..? అనేది తనిఖీ చేయనున్నారు. ఈ ప్రక్రియ అంతా స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) పోలీసుల పర్యవేక్షణలో జరగనుంది.

☛ Police Jobs 2023 : ఒకే కుటుంబం.. ఒకేసారి ముగ్గురు కానిస్టేబుల్‌ ఉద్యోగాలు కొట్టారిలా.. ఎక్క‌డంటే..

నవంబరు 20వ తేదీ వ‌ర‌కు..?
12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళ అభ్యర్థులకు సంబంధించి ఎస్బీ విచారణ ప్రక్రియను త్వరితగతిన చేపడితే నవంబరు 20 వరకు కొనసాగే ఆస్కారం ఉండడంతో ఆ తర్వాతే కానిస్టేబుళ్ల శిక్షణ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అటెస్టేషన్ ఇలా..?

ts police logo

TSLPRB బోర్డు వెల్లడించిన ప్రకారం తుది ఎంపికైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అటెస్టేషన్‌ ఫారం తీసుకోవాలి. టీఎస్‌ఎల్పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల లాగిన్‌లో అక్టోబ‌ర్ 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వెబ్‌ టెంప్లేట్‌ రూపంలో ఈ ఫారంలు అందుబాటులో ఉంటాయి. వీటిని డిజిటల్‌గా పూర్తిచేసిన తర్వాత పీడీఎఫ్‌ రూపంలో మూడు సెట్‌లు ప్రింట్‌లు ఏ4 సైజు పేపర్‌పై ఒకవైపు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న మూడు సెట్‌లపై అభ్యర్థులు సంతకాలు చేసి, రెండు పాస్‌పోర్టు ఫొటోలు అతికించి, గెజిటెడ్‌ ఆఫీసర్‌తో ధ్రువీకరణ సంతకం తీసుకోవాలి.

ఈ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను పొందుపరిచి అక్టోబ‌ర్ 12,13 తేదీల్లో నిర్దేశిత కేంద్రాల్లో సమర్పించాలి. సివిల్, ఏఆర్‌ కానిస్టేబుళ్లు అక్టోబ‌ర్ 12న ఎస్పీ/ కమిషనర్‌ కార్యాలయాల్లో,  ఎస్పీఎఫ్, ఎస్‌ఏఆర్, మెకానిక్, ట్రాన్స్‌పోర్టు (హెచ్‌ఓ) కానిస్టేబుళ్లు అక్టోబ‌ర్ 13న హైదరాబాద్‌ సిటీ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో,  మిగిలిన అభ్యర్థులు 13న ఆయా జిల్లాల ఎస్పీ, పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయాల్లో అటెస్టేషన్‌ ఫారంలు సమర్పించాలి.

☛ Constables Success Stories : ఈ ఆరుగురు కానిస్టేబుల్స్‌.. ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా..

Published date : 10 Oct 2023 09:00AM

Photo Stories