Constables Success Stories : ఈ ఆరుగురు కానిస్టేబుల్స్.. ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా..
ఈ సందర్భంగా వీరిని ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కానిస్టేబుల్స్‌గా విధులు నిర్వహిస్తూనే ఎస్‌ఐలుగా ఎంపికవ్వడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా సేవ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తమ విధులు, కర్తవ్యాల్లో జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
☛ SI Inspirational Success Story : ఈ బలమైన సంకల్పంతోనే.. ఎస్సై ఉద్యోగం కొట్టా.. ఎందుకంటే..?
అనంతరం ఎస్‌ఐలుగా ఎంపికై న కానిస్టేబుల్స్ ఉమాదేవి, రాజేందర్‌రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి , శ్రీశైలం, శశిధర్, సుజిత్‌ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్బీ డీఎస్పీ జానయ్య, ఏఓ జ్యోతిర్మని, డీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ డీవీపీ రాజు, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ ప్రమీల, ఆర్‌ఐ సూర్య నాయుడు, జిల్లా పోలీస్ ప్రెసిడెంట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
☛ TS SI Selected Candidates Stories : ఒక్కో దశ దాటుతూ.. ఎస్ఐ ఉద్యోగం సాధించామిలా.. నేడు..
☛ Success Stories : ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా.. చిన్న స్థాయి నుంచి..