TS SI Selected Candidates Stories : ఒక్కో దశ దాటుతూ.. ఎస్ఐ ఉద్యోగం సాధించామిలా.. నేడు..
కొందరు కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూ ఎస్‌ఐ పోస్టు సాధించగా మరికొందరు తొలి ప్రయత్నంలో కలను సాకారం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరి సక్సెస్ జర్నీ మీకోసం..
వికారాబాద్ అర్బన్.. మున్సిపల్ పరిధిలోని ఇందిరానగర్‌కు చెందిన బొండాల యతీష్ చంద్ర సిద్ధులూరు పోస్టాఫీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగం చేస్తూనే ఎస్‌ఐ పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే ఎస్‌ఐగా ఎంపికయ్యారు. అలాగే పులుసుమామిడికి చెందిన హిమబిందు తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐ ఉద్యోగం సాధించారు. తండ్రి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే కొలువు సాధించానని తెలిపారు.
☛ Success Stories : ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా.. చిన్న స్థాయి నుంచి..
ఒక్కో దశ దాటుతూ..
దౌల్తాబాద్‌లో ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్వేత, రక్షితారెడ్డి చిన్ననాటి నుంచి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే పట్టుదలతో సన్నద్ధమయ్యారు. ఎస్‌ఐ పరీక్షలకు సంబంధించి ఒక్కో దశ దాటుకుంటూ గమ్యాన్ని చేరుకున్నారు. తుది ఫలితాల్లో మండలం నుంచి ఇద్దరూ ఎస్‌గా ఉద్యోగం సాధించారు.
కానిస్టేబుల్ నుంచి ఎస్‌ఐగా..
మోమిన్‌పేట.. మండల పరిధిలోని అంరాధికలాన్ గ్రామానికి చెందిన మీనాక్షి, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సుజిత్ ఇద్దరు ఎస్‌ఐ ఉద్యోగాలకు ఏంపికయ్యారు. మీనాక్షి ఎంబీఏ పూర్తి చేయగా, సుజీత్.. ఆరు సంవత్సరాల క్రితం కానిస్టేబుల్‌గా ఏంపికై విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఎస్‌ఐ తుది ఫలితాల్లో ఇరువురూ ఎంపికయ్యారు.
☛Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..
జవాన్ టూ ఎస్ఐ..
కొడంగల్ రూరల్.. మండల పరిధిలోని టేకుల్‌కోడ్‌కు చెందిన మహేందర్‌రెడ్డి, పాతకొడంగల్‌కు చెందిన అశోక్ ఎస్‌ఐ ఉద్యోగాలు సాధించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహేందర్‌రెడ్డి ఆర్మీలో జ వాన్‌గా విధులు నిర్వహించి రిటైర్ అయ్యారు. ఈ క్రమంలో ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐ సెలక్షన్స్ లో పాల్గొని కొలువు సాధించారు.పాతకొడంగల్ గ్రామానికి చెందిన అశోక్ ఎస్‌ఐ పరీక్షా ఫలితాల్లో విజయం సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు.
ఏడు ఎస్ఐ ఉద్యోగాలతో..
కుల్చచర్ల మండలానికి చెందిన 7మంది అభ్యర్థులు ఎస్‌ఐ ఉద్యోగాలను సాధించారు. అదేవిధంగా కుల్కచర్ల మండలంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఒకరు, ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న మరొకరు ఎస్‌ఐగా ఎంపికయ్యారు.
☛Success Story: రాష్ట్ర కొలువుతో పాటు కేంద్ర కొలువు కొట్టానిలా.. కానీ ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే..
ఆటో డ్రైవర్‌కా బేటా ఎస్‌ఐ..
తాండూరు టౌన్.. పెద్దేముల్ మండలం రుక్మాపూర్‌కు చెందిన నాగప్ప, లాలమ్మ దంపతుల కుమారుడు అశోక్ ఎస్‌ఐ ఉద్యోగం సాధించాడు. తండ్రి నాగప్ప ఆటో డ్రైవర్ కాగా, తల్లి కూలీపని చేస్తుంటుంది. అశోక్ ప్రస్తుతం ఓయూలో పీజీ చదువుతున్నాడు. ఆటో డ్రైవర్‌కా బేటా ఎస్‌ఐ అని స్థానికులు అంటుంటే ఆనందంగా ఉంది.
☛Chandrakala, IAS: ఎక్కడైనా సరే..‘తగ్గేదే లే’
కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తూనే..
తాండూరు మండలం కరన్‌కోట్ పీఎస్‌లో విధులు నిర్వర్తిస్తున్న లక్ష్మీకాంత్‌రెడ్డి ఎస్‌ఐ కొలువు సాధించాడు.సీఐ రాంబాబు, ఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డి, సహచర కానిస్టేబుళ్లు లక్ష్మీకాంత్‌రెడ్డిని సత్కరించారు. కాగా లక్ష్మీకాంత్‌రెడ్డి స్వగ్రామం కోట్‌పల్లి మండలం బార్వాద్ గ్రామం.
☛Madhavi, CI : పొట్టకూటి కోసమే ఈ పోలీసు ఉద్యోగంలో చేరా.. కానీ
తల్లి కష్టానికి తగిన ఫలితం దక్కింది..
మర్పల్లి మండల పరిధిలోని వీర్లపల్లికి చెందిన వెంకట్‌రెడ్డి సుగణమ్మ రెండో కుమారుడు శశివర్ధన్‌రెడ్డి 2020లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం జీడిమెట్ల పీఎస్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఎస్‌ఐ ఉద్యోగం సాధించాడు. అలాగే మండల పరిధిలోని బూచన్‌పల్లి గ్రామానికి చెందిన మంగమ్మ (ఒంటరి మహిళ) రెక్కల కష్టంతో ఇద్దరు కుమారులను చదివించింది. పెద్దకుమారుడు రాఘవేందర్‌రెడ్డి.. 2020 ఏడాదిలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. శంకర్‌పల్లి పీఎస్‌లో విధు లు నిర్వర్తిస్తూనే ఎస్‌ఐ పరీక్షలు రాసి లక్ష్యాన్ని చేరుకున్నాడు.
☛Uday Kumar Reddy, SP : నాడు ఇక్కడే ఎస్సైగా.. నేడు ఇక్కడే ఎస్పీగా..!
ఎస్‌ఐ ఫలితాల్లో దోమ మండలానికి చెందిన రవీందర్, శ్రీనివాస్, దాదాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ ఎస్‌ఐ ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా వారిని స్థానికులు సోమవారం ఘనంగా సన్మానించారు.
వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలి..
బొంరాస్‌పేట.. మండల పరిధిలోని చౌదర్‌పల్లికి చెందిన కిష్టమ్మ, కిష్టయ్య కుమారుడు.. బందెయ్య టీఎస్‌ఎస్‌పీ (రిజర్వు) ఎస్‌ఐగా ఎంపిక కావడంతో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శేరినారాయణరెడ్డి అతడిని ఘనంగా సన్మానించారు. యువత బందెయ్యను స్ఫూర్తిగా తీసుకుని అనుకున్న లక్ష్యం సాధించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. స్థానిక నాయకులు, గ్రామస్తులు బందెయ్యను అభినందించారు.
☛Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ కసితోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..
☛Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..
కూలీపని చేసి చదివించారు.. నేడు..
నా పేరు శ్వేత. మాది దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట గ్రామం. నేను వెంకటయ్యగౌడ్, మంగమ్మ దంపతుల రెండవ కూతుర్ని. తల్లిదండ్రులు కూలీపని చేసి నన్ను చదివించారు. వారి కష్టాన్ని చూస్తూ పెరిగాను. మహబూబ్‌నగర్‌లో ఇంటర్, డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం పీజీ చదువుతున్నాను. ఓ వైపు పీజీ చేస్తూనే పోటీ పరీక్షలపై దృష్టి సారించాను. ఇటీవల విడుదల చేసిన ఎస్ఐ ఫలితాల్లో.. ఆర్‌ఎస్‌ఐగా ఎంపికయ్యాను.
☛ Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా లక్ష్యాన్ని మాత్రం మరువలేదు..