Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా లక్ష్యాన్ని మాత్రం మరువలేదు..
ఉన్నత శిఖరాలను సాధించాలంటే అహోరాత్రులు శ్రమించక తప్పదు. సరిగ్గా ఇదే విషయాన్ని నమ్మాడు కనుకనే అతను అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాడు. పేదరికం అడ్డుపడి.. వేధించిన తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు అది ఏ మాత్రం అడ్డు కాలేదు ఈ యువ ఐపీఎల్ అధికారి సఫిన్ హసన్‌కి.
రాత్రింబవళ్లు..
దేశంలోనే అత్యంత పిన్న వయస్సులో ఐపీఎస్ అయిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. 22 ఏళ్ల వయస్సులోనే యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి అత్యుత్తమ ర్యాంకు సాధించి ఐపీఎస్ అయ్యాడు. ఆ పరీక్ష ఎంత కఠినంగా ఉంటుందో అందరికీ తెలుసు. అయినప్పటికీ రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఐపీఎస్ అయ్యాడు. సివిల్ సర్వీస్ ఎగ్జామ్‌లు రాసేవారు చాలా మంది ఐఏఎస్ కావాలని కలలు కంటుంటారు. కానీ హసన్ మాత్రం ఐపీఎస్‌ను ఎంపిక చేసుకున్నాడు. ప్రజలకు ఐపీఎస్ అయి సేవ చేయాలన్నది అతని ముఖ్య ఉద్దేశం. అందుకనే ఐపీఎస్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు...సాధించాడు.
తన లక్ష్యాన్ని..
2018లో యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఆలిండియా స్థాయిలో 570 ర్యాంకును సాధించాడు. తర్వాత ఐపీఎస్ అయ్యి 2019 డిసెంబర్ 23న జామ్‌నగర్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఎట్టకేలకు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు.
కుటుంబ నేపథ్యం:
హసన్ ది చాలా నిరుపేద కుటుంబం. హసన్ తల్లిదండ్రులు ముస్తఫా హసన్, నసీంబా. గుజరాత్‌లోని కనోదర్ అనే ఓ చిన్న పల్లెటూరు వీరిది. వీరికి పూట పూటకు సరిగ్గా భోజనమే దొరికేది కాదు. కొన్ని సార్లు రాత్రి పూట ఆకలితోనే నిద్రపోవాల్సి వచ్చేదని హసన్ తెలిపాడు. అతని తల్లిదండ్రులు వజ్రాల గనుల్లో కార్మికులుగా పనిచేసేవారు. హసన్ తన చదువు కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. వచ్చే కొద్దిపాటి ఆదాయం అతని చదువుకు సరిపోయ్యేది కాదు. తమ కుమారుడి ఉన్నత విద్యకు నిధులు సమకూర్చడానికి, అదనపు డబ్బు సంపాదించడానికి వారు స్థానిక రెస్టారెంట్లలో పని చేసారు. అతని తల్లి పార్టీలు, పెళ్లిళ్లలో రోటీలను తయారు చేసి డబ్బులు సంపాదించేది. ఆ విధంగా హసన్ కష్టపడి చదివి ఒక్కో మెట్టుకు ఎదుగుతూ నేడు ఈ స్థానానికి చేరుకున్నాడు.
మన తెలుగు హీరో అంటే..
హసన్ కు దక్షిణాదిలో సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే చాలా ఇష్టం. తను గుజరాతీ అయినా, పెద్దగా సూపర్ స్టార్ సినిమాలు చూడకపోయినా, ఆయనంటే అభిమానమట! కారణం… ప్రిన్స్ గురించి ఆయన సన్నిహితులు హసన్ కి చెప్పిన మాటలే..! హసన్ తన ఇస్ స్టాగ్రామ్ చాట్ లో మహేశ్ బాబు సేవా కార్యక్రమాల గురించి మాట్లాడాడు. నేరుగా ఆయన చేస్తోన్న పనుల గురించి చెప్పకపోయినా మహేశ్ బాబు సన్నిహితులు తనకు చెప్పిన విషయాల వల్ల అభిమానిని అయ్యాను అంటూ స్పందించాడు.
Ramesh Gholap,IAS officer: మాది నిరుపేద కుటుంబం.. పొట్ట కూటి కోసం గ్రామాల్లో గాజులు అమ్మి..
IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్ టూ 'ఐఏఎస్'..సెలవుల్లో పొలం పనులే...
Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్..
Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..