Skip to main content

Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..

సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఆఫ్ పోలీస్ .. యూత్‌లో క్రేజీ ఉద్యోగం. ఎస్‌ఐ పోస్టు సాధించడం అంత సులువేమీ కాదు.
పగిళ్ల రవికుమార్, సివిల్ ఎస్‌ఐ
పగిళ్ల రవికుమార్, సివిల్ ఎస్‌ఐ

ప్రిలిమినరీ పరీక్ష, దేహదారుఢ్య, సామర్థ్య పరీక్షలు, తుది రాత పరీక్షలు.. ఇలా అన్ని విభాగాల్లోనూ ప్రతిభ కనబరిస్తేనే కోరుకున్న కొలువు సాధ్యమవుతుంది. గ‌తంలో తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రొవిజినల్ ఎంపిక జాబితాను విడుదల చేసింది. ఇందులో నల్లగొండ జిల్లాకు చెందిన పగిళ్ల రవికుమార్ సివిల్ ఎస్‌ఐ సాధించాడు. రానున్న పోలీసు ఉద్యోగాల నోటిఫికేష‌న్‌లో.. ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఎస్‌ఐ పరీక్షలో విజయానికి వ్యూహాలు రవి మాటల్లోనే..

కుటుంబ నేప‌థ్యం : 
మాది నల్లగొండ జిల్లా గట్టుప్పల గ్రామం. నాన్న పగిళ్ల భద్రయ్య, అమ్మ చంద్రమ్మ. నన్ను పెంచిపెద్దచేసిన అమ్మానాన్న లక్ష్మమ్మ, చంద్రయ్య. నేను ఇంటర్‌లో ఉన్నప్పుడే నాన్న చంద్రయ్య చనిపోయారు. అప్పటినుంచి అమ్మ లక్ష్మమ్మ కూలి పనులు చేస్తూ.. నన్నూ, తమ్ముడు రాముని చదివించింది. 

పోలీసు ఉద్యోగం సాధించాలంటే...వీటిలో అప్రమత్తంగా ఉండాలి...: ఉదయ్‌కుమార్,ఎస్ఐ

నా చ‌దువు : 
నేను ఏడో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ స్కూల్లో, తర్వాత నాగార్జునసాగర్‌లోని ఏపీఆర్ స్కూల్(బీసీ-బాయ్స్)లో పదోతరగతి వరకు చదివాను. నల్లగొండలోని గౌతమి కాలేజీలో ఇంటర్, ఎన్‌జీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత ఐసెట్‌లో మంచి ర్యాంకు రావడంతో జేఎన్‌టీయూ హైదరాబాద్ క్యాంపస్‌లో ఎంబీఏ(ఫైనాన్స్) చేశాను. 

ఖర్చుల కోసం..
నాన్న చనిపోయాక ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయ పనుల్లో అమ్మకు చేదోడు వాదోడుగా ఉండేవాడిని. ఎంబీఏ చదివేందుకు హైదరాబాద్ వచ్చినప్పుడు ఖర్చుల కోసం హోంట్యూషన్లు చెప్పాను.

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు...
ఎంబీఏ పూర్తయ్యాక అసిస్టెంట్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైయిజర్‌గా 2011లో ఉద్యోగం వచ్చింది. ఏంజెల్ కమోడిటీస్ బ్రోకింగ్ ప్రైవేట్ కంపెనీలో రెండేళ్ల పాటు పని చేశాను. చేసే ఉద్యోగంలో సంతృప్తి లభించలేదు. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ అక్కడి వారికి సేవ చేసే అవకాశమున్న జాబ్ చేయాలని భావించి గ్రూప్-2కు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకున్నా. అదే సమయంలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడింది. దీంతో ఉద్యోగం వదిలి గ్రూప్-2కు ప్రిపరేషన్ ప్రారంభించా. కుటుంబం గడవడం కష్టం కావడంతో ట్యూషన్లు చెబుతూ ప్రిపరేషన్ కొనసాగించా. గ్రూప్-2 వాయిదా పడటంతో ఎస్‌ఐ పరీక్షపై పూర్తిగా దృష్టిసారించా. ప్రిపరేషన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు నా భార్య కవిత సపోర్ట్ మరువలేనిది.

Success Story: రాష్ట్ర కొలువుతో పాటు కేంద్ర కొలువు కొట్టానిలా.. కానీ ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే..

కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై..
ఎస్‌ఐ ఉద్యోగాల్లో నేను సివిల్ పోస్టు లక్ష్యంగా ప్రిపరేషన్ సాగించా. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత రోజులో ఎక్కువ సమయం గ్రౌండ్‌లోనే గడిపేవాడిని. సివిల్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు అర్హత సాధించాలంటే.. 800 మీటర్ల పరుగు పందెంతోపాటు ఏవైనా రెండు ఈవెంట్లలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. కానీ, మిగతా ఉద్యోగాలకు పోటీ పడాలంటే.. ఉన్న 5 ఈవెంట్లలో అర్హత సాధించాలి. నేను 800 మీటర్లతోపాటు మరో రెండు ఈవెంట్లలో మాత్రమే పాల్గొన్నా. కానిస్టేబుల్ పోస్టులో కూడా కేవలం సివిల్ పోస్టులకే ప్రయత్నించా. కానిస్టేబుల్‌గా ఎంపికై అంబర్‌పేటలో శిక్షణలో ఉన్నా. గత ఈవెంట్ల సమయంలో.. ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఈవెంట్లలో తప్పనిసరైన 800 మీటర్ల పరుగు పందెంలో చాలామంది అభ్యర్థులు వెనుదిరిగారు. ఒకవేళ ఈసారి కూడా ఈవెంట్లలో ఇదే విధానం ఉంటే.. అభ్యర్థులు మొదటి నుంచే గ్రౌండ్‌కు వెళ్లాలి. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలకు, ఈవెంట్లకు మధ్య చాలా తక్కువ సమయం ఉంటుంది. కాబట్టి ముందు నుంచే ఫిట్‌గా ఉంటూ.. రన్నింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సివిల్, ఫైర్ ఆఫీసర్ తప్ప మిగిలిన పోస్టుల భర్తీ విషయంలో మాత్రం ఈవెంట్లలో సాధించిన మెరిట్‌కు స్కోరు ఉంటుంది. కాబట్టి గ్రౌండ్‌లో ఎక్కువగా ప్రాక్టీస్ చేసే వారు ఈవెంట్లలో మంచి స్కోరు చేయవచ్చు. ఇది తుది ఎంపికలో కీలకంగా మారుతుంది.

న్నో అవమానాలు.. అవహేళనలు ఎదుర్కొన్ని తహశీల్దార్ అయ్యానిలా..

ఇవే కీలకం..
ఈవెంట్లలో వడపోత తర్వాత సుమారు 32,682 మంది తుది రాత పరీక్షకు హాజరయ్యారు. నోటిఫికేషన్ ప్రకారం తెలుగు, ఇంగ్లిష్‌లో సాధించే మార్కులను సివిల్, స్టేషన్ ఆఫీసర్ పోస్టుల ఎంపికలో పరిగణనలోకి తీసుకున్నారు. ఇతర పోస్టులకు ఇందులో కనీస అర్హత మార్కులు సాధిస్తే చాలు. అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిష్ విభాగాలను తక్కువ అంచనా వేయకుండా.. అర్థమెటిక్, జీఎస్‌లతో సమానంగా ప్రిపరేషన్ సాగించాలి. ఈసారి చాలా మంది అభ్యర్థులు జీఎస్, అర్థమెటిక్ బాగా రాసినా.. ఇంగ్లిష్‌లో అర్హత సాధించలేక ఉద్యోగావకాశాలు కోల్పోయారనే విషయాన్ని మరవకూడదు.

కోచింగ్ తీసుకోలేదు.. కానీ..
నాకు అర్థమెటిక్ ప్రాథమిక అంశాలపై అవగాహన ఉంది. అందుకే ఎస్‌ఐకి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోలేదు. అర్థమెటిక్‌లో భాగంగా రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అంశాలు ఉంటాయి. ఇందులో ఎక్కువ స్కోరు చేయడానికి ఏకైక మార్గం ప్రాక్టీస్. అంతకుమించిన సక్సెస్ ఫార్ములా లేదు. ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయడం, వీలైనన్ని మాక్ టెస్టులు రాయడం మేలు. అర్థమెటిక్‌కు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు టెక్ట్స్‌బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. జనరల్ స్టడీస్‌కు సంబంధించి ‘ఎడ్యుకేష‌న్‌.సాక్షి.కామ్‌’ మెటీరియల్, ఒక్కో సబ్జెక్ట్‌కు ఒక ప్రామణిక పుస్తకాన్ని చదివా. ఎస్‌ఐ ప్రిలిమ్స్, తుది రాత పరీక్షల్లో జీఎస్‌లో నేరుగా ప్రశ్నలు రాలేదు. సబ్జెక్ట్‌ను అర్థం చేసుకునేవారు సమాధానాలు గుర్తించేలా ప్రశ్నలు అడిగారు. దీంతో గ్రూప్స్ ప్రిపరేషన్ నాకు హెల్ప్ అయ్యింది. సొంతంగా తయారు చేసుకున్న నోట్స్ చివరల్లో ఉపయోగపడింది. తెలంగాణ టాపిక్ ఉంది కాబట్టి తెలంగాణ తొలి, మలి దశల ఉద్యమాల గురించి, భౌగోళికంగా ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు, పర్యాటక ప్రదేశాలు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.

Madhavi, CI : పొట్టకూటి కోసమే ఈ పోలీసు ఉద్యోగంలో చేరా.. కానీ

‘సాక్షి ఎడ్యుకేష‌న్’కి ప్ర‌త్యేక ధన్యవాదాలు..
అన్ని రకాల నోటిఫికేషన్ల వివరాలు, ప్రిపరేషన్ గెడైన్స్, జీఎస్, మ్యాథ్స్, ఇంగ్లిష్, తెలంగాణ ఉద్యమ చరిత్ర, కరెంట్ అఫైర్స్ మొదలైన అంశాలకు సంబంధించి ‘ఎడ్యుకేష‌న్‌.సాక్షి.కామ్‌’ ఇచ్చిన సమాచారం నా విజయానికి బాటలు వేసింది. సాక్షి భవిత, విద్య పేజీల‌తో పాటు.. ‘ఎడ్యుకేష‌న్‌.సాక్షి.కామ్‌’ ఇచ్చే గ్రూప్స్ పరీక్ష కంటెంట్ నా ప్రిపరేషన్‌కు ఎంతో దోహదం చేసింది. గ్రూప్-2 సమయంలో ప్రత్యేకంగా ఇచ్చిన నాలుగు విద్య పేజీలు గ్రూప్స్, ఎస్‌ఐ ప్రిపరేషన్‌కు సరిపోయేవి. నేను ఆ పేజీలు అన్నీ సేకరించి భద్రపరుచుకున్నా. పరీక్షకు వెళ్లే ముందు కూడా వాటినే చదువుకున్నా. ఆ మెటీరియల్ ఇప్పటికీ నా దగ్గరే భద్రంగా ఉంది. ఎస్‌ఐ వంటి తీవ్ర పోటీ ఉండే పరీక్షలో నాలాంటి గ్రామీణ ప్రాంత విద్యార్థి విజయం సాధించేలా మెటీరియల్ అందించిన ‘సాక్షి ఎడ్యుకేష‌న్’కి ధన్యవాదాలు.

Uday Kumar Reddy, SP : నాడు ఇక్కడే ఎస్సైగా.. నేడు ఇక్క‌డే ఎస్పీగా..!

నా ప్రొఫైల్ ఇలా..
పదో తరగతి మార్కులు : 551 (2002-03)
ఇంటర్ మార్కులు         : 940 (2003-05)
బీఎస్సీ                           : 73 శాతం (2005-08)
ఎంబీఏ                           : 66 శాతం (2009-11)

Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ క‌సితోనే మూడు ప్ర‌భుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..​​​​​​​

nspirational Story: కూలీ ప‌నులు చేస్తూ చ‌దివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా

​​​​​​​Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

Inspirational Story: న‌న్ను పేదవాడు.. రిక్షావాలా కొడుకు అని హీనంగా చూశారు.. ఈ క‌సితోనే ఐఏఎస్ అయ్యానిలా..

Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా ల‌క్ష్యాన్ని మాత్రం మరువ‌లేదు..

Published date : 28 Feb 2022 04:58PM

Photo Stories