Inspiring Story: ఎన్నో అవమానాలు.. అవహేళనలు ఎదుర్కొన్ని తహశీల్దార్ అయ్యానిలా..
తన కుమార్తె ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తండ్రి కలలుగన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆరుగురు తోబుట్టువులతోపాటు గౌరమ్మను కూడా పాఠశాలకు పంపించాడు. అయితే, గౌరమ్మ చదువుకోవడాన్ని అందరూ తప్పు పట్టారు.
అనవసరంగా..
‘గౌరమ్మను చదివించినా ప్రయోజనం లేదని.. తనకీ ఎవరూ ఉద్యోగం ఇవ్వరని... అనవసరంగా ఖర్చు చేయద్ద’ని నచ్చచెప్పేవారు. అయినప్పటికీ అవేమీ పట్టించుకోలేదు. తన కూతురు ఉన్నత పదవుల్లో ఉంటే ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని ఆయన నమ్మాడు. అదే నమ్మకంతోనే గౌరమ్మ కూడా ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
అవమానాలు.. అవహేళనలతో పాటు..
యూపీఎస్సీ పరీక్షల కోసం కోచింగ్‌లో చేరారు. అయితే, అక్కడ అవమానాలు.. అవహేళనలతో పాటు మరో సమస్య కూడా గౌరమ్మకు ఎదురైంది. కన్నడ మీడియంలో చదువుకున్న ఆమెకు తరగతులన్నీ ఆంగ్లంలో బోధించడంతో కష్టంగా మారింది. దీంతో తను యూపీఎస్సీ కలను వదులుకొని, బీఈడీ చేయాలని నిర్ణయించుకుంది. అదేవిధంగా పూర్తిచేసి.. టీచర్‌గా ఉద్యోగం సాధించింది.
అంతా బాగుందని అనుకున్న సమయంలో..
అంతా బాగుందని అనుకొంటున్న సమయంలో.. గౌరమ్మ తండ్రి మరణించారు. దీంతో తనని ఉన్నత శిఖరాల్లో చూడాలనుకొన్న తండ్రి కోరికను తీర్చలేకపోయానని ఎంతో బాధపడింది.
ఎగతాళి చేసినవారే ఇప్పుడు..
అందుకే.. కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కెపీఎస్సీ) పరీక్ష రాసి విజయం సాధించాలని నిర్ణయించుకుంది. కష్టపడి పట్టుదలతో శ్రమించి.. 2019 కెపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం స్వస్థలంలోనే తహశీల్దార్‌గా పనిచేస్తోంది. ఈమెకు ఎవరు ఉద్యోగం ఇస్తారంటూ ఎగతాళి చేసినవారే ఇప్పుడు గౌరవిస్తున్నారు.
Inspirational Story: పేదరికాన్ని జయించాడు... సివిల్స్ సత్తా చాటాడు..
Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్ వైపు..నా సక్సెస్‌కు కారణం వీరే..
సంకల్పబలం ఉంటే ఏదైనా సాధ్యమే..
ఈ విషయమై గౌరమ్మ మీడియాతో మాట్లాడుతూ...‘‘మా నాన్న మరణించిన తర్వాత... ఆయన కలను నిజం చేయాలని నిర్ణయించుకున్నా. మనస్సును లగ్నం చేసి ఎంతో కష్టపడ్డా. విజయం సాధించా. సంకల్పబలం ఉంటే ఏదైనా సాధ్యమే. అది లేకపోతే ఉన్నత శిఖరాలను అధిరోహించలేము. కలలను సాకారం చేసుకోలేము. కలలు సాకారం కాకపోతే సంతృప్తి ఉండదు.’’ అని అన్నారు.
Inspirational Story: కూలీ పనులు చేస్తూ చదివా.. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా
Veditha Reddy, IAS : ఈ సమస్యలే నన్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్...
Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..
Chandrakala, IAS: ఎక్కడైనా సరే..‘తగ్గేదే లే’
Success Story: పేదరికం అడ్డుపడి.. వేధించిన నా లక్ష్యాన్ని మాత్రం మరువలేదు..