Skip to main content

Police Jobs 2023 : ఒకే కుటుంబం.. ఒకేసారి ముగ్గురు కానిస్టేబుల్‌ ఉద్యోగాలు కొట్టారిలా.. ఎక్క‌డంటే..

ఈ ఇంటిలో పోలీసు ఉద్యోగాల పంట పండింది. ఒకే కుటుంబం చెందిన ముగ్గురు కుమారులకు ఒకే సారి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ఎంపిక‌య్యారు.
Three brothers celebrating their police constable job selections, Police constable recruitment success in one family,ts police constable success news in telugu,Proud parents with three police constable sons
ts police constable success story

తెలంగాణ పోలీస్‌ కానిస్టేబుళ్ల తుది ఎంపికకు సంబంధించిన ఫలితాలు అక్టోబ‌ర్ 4వ తేదీన విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఈ ఫ‌లితాల్లో మెద‌క్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన
సంగు శ్రావణ్, ప్రశాంత్ సందీప్ ఒకే కుటుంబం చెందిన ఈ ముగ్గురు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు.

☛ Constables Success Stories : ఈ ఆరుగురు కానిస్టేబుల్స్‌.. ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా..

కుటుంబ నేప‌థ్యం :
సంగు దుర్గయ్య-సంగు లక్ష్మికి ముగ్గురు కుమారులు. తెలంగాణ కానిస్టేబుల్‌ పరీక్షల్లో ఈ ముగ్గురు కుమారులు అర్హత సాధించి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగంకు ఎంపిక‌య్యారు. సంగు శ్రావణ్ (టిఎస్ఎస్‌పీ) పీసి, సంగు ప్రశాంత్ (ఏఆర్) పీసీ, సంగు సందీప్ (టిఎస్ఎస్‌పీ) పీసీగా ఉద్యోగాలు సాధించారు. దీంతో వీరి తల్లిదండ్రులు సంతోషంతో మునిగిపోయారు. గ్రామ ప్రజలు కూడా ఆ ముగ్గురిని అభినందించారు. కష్టపడి చదివితే విజయం తప్పకుండా సాధించ‌వ‌చ్చ‌ని  నిరూపించారు ఈ ముగ్గురు.

☛ Telangana Constable Success Stories : ఒకేసారి అక్కాచెల్లెళ్లు కానిస్టేబుల్ ఉద్యోగాలు కొట్టారిలా.. ఇంకా వీళ్లు..

తెలంగాణ‌లో కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ఎంపికైనవారు..

పోస్టు

నోటిఫైడ్‌ ఖాళీలు

ఎంపికైనవారు
పురుషులు/ మహిళలు

సివిల్‌

4965

3298/1622

ఏఆర్‌

4423

2982/948

ఎస్‌ఏఆర్‌సీపీఎల్‌ (మెన్‌)

100

100/––

టీఎస్‌ఎస్‌పీ  (మెన్‌)

5010

4725/––

స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (మెన్‌)

390

382/––

ఫైర్‌మెన్‌

610

599/––

వార్డర్‌ (మేల్‌)

136

134/––

వార్డర్‌ (ఫిమేల్‌)

10

––/10 

ఐటీ, కమ్యూనికేషన్స్‌

262

171/86

మెకానిక్‌ (మెన్‌)

21

21/––

ట్రాన్స్‌పోర్ట్‌ కానిస్టేబుల్‌ (హెచ్‌ఓ)

6

4/2

ట్రాన్స్‌పోర్ట్‌ కానిస్టేబుల్‌ (ఎల్‌సీ)

57

44/13

ఎక్సైజ్‌

614

406/203

మొత్తం

16604

   12866/2884

Published date : 06 Oct 2023 09:07AM

Photo Stories