Telangana Constable Success Stories : ఒకేసారి అక్కాచెల్లెళ్లు కానిస్టేబుల్ ఉద్యోగాలు కొట్టారిలా.. ఇంకా వీళ్లు..
మొత్తం 13 కేటగిరీల్లో 16,604 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా, దరఖాస్తు చేసుకున్న వారిలో 15,750 మందిని ఎంపిక చేసినట్టు టీఎస్‌ఎల్పీఆర్‌బీ చైర్మన్ వీవీ.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పలితాల్లో.. ఒకే కుటుంబంకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు, ఈ నేపథ్యంలో వీరి సక్సెస్ స్టోరీ మీకోసం..
☛ SI Inspirational Success Story : ఈ బలమైన సంకల్పంతోనే.. ఎస్సై ఉద్యోగం కొట్టా.. ఎందుకంటే..?
ఈ ఇంటిలో పోలీసు ఉద్యోగాల పంట..
ఈ ఇంటిలో పోలీసు ఉద్యోగాల పంట పండింది. ఒకే కుటుంబం చెందిన ప్రత్యూష, వినూష అక్కాచెల్లెళ్లు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకబోర్డు విడుదల చేసిన తుది ఫలితాల్లో ఈ అక్కాచెల్లెళ్లు ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరి తండ్రి మర్థ శ్రీనివాస్. ఈయన వరంగల్ జిల్లాలోని కొత్తూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి అంజలి. వీరి కుమార్తెలు ప్రత్యూష, వినూష.
☛ Selected for SI Post: ఉద్యోగంలో విధులు నిర్వహిస్తూనే ఎస్ఐగా ఎంపిక
☛ Success Stories : ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా.. చిన్న స్థాయి నుంచి..
ఓపెన్ కేటగిరీలో ఇద్దరు..
వీరు కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో ఉత్తీర్ణత సాధించి పరీక్షలు రాశారు. ఇందులో ఓపెన్ కేటగిరీలో ఇద్దరు 111 మార్కులు సాధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు వారిని అభినందించారు. అలాగే వీరి మండల పరిధిలో పలువురు కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు.
☛ Constable Posts Achievers: కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టామిలా.. మా కుటుంబంలో..
☛ TS SI Selected Candidates Stories : ఒక్కో దశ దాటుతూ.. ఎస్ఐ ఉద్యోగం సాధించామిలా.. నేడు..
ఈ ఏడాది జూన్ 3, 4 వారాల్లో రాష్ట్రంలోని 18 కేంద్రాల్లో నిర్వహించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో భాగంగా అభ్యర్థుల విద్యార్హతలు, రిజర్వేషన్లు, స్థానికత, వయసు మినహాయింపు, ఇతర అంశాలు పరిశీలించామని, దీంతోపాటు శారీరక సామర్థ్య పరీక్ష, ట్రేడ్ టెస్టు, తుది రాత పరీక్ష అనంతరం అన్నింటిని పరిగణనలోకి తీసుకొని వీరిని ఎంపిక చేసినట్టు ఆ ప్రకటనలో శ్రీనివాసరావు తెలిపారు. కోర్టు కేసులు, ఇతర సాంకేతిక కారణాలతో 854 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు.
☛Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..
ఆన్‌లైన్‌లో..
బోర్డు వెల్లడించిన ప్రకారం తుది ఎంపికైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అటెస్టేషన్ ఫారం తీసుకోవాలి. టీఎస్‌ఎల్పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల లాగిన్‌లో అక్టోబర్ 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వెబ్ టెంప్లేట్ రూపంలో ఈ ఫారంలు అందుబాటులో ఉంటాయి. వీటిని డిజిటల్‌గా పూర్తిచేసిన తర్వాత పీడీఎఫ్ రూపంలో మూడు సెట్‌లు ప్రింట్‌లు ఏ4 సైజు పేపర్‌పై ఒకవైపు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న మూడు సెట్‌లపై అభ్యర్థులు సంతకాలు చేసి, రెండు పాస్‌పోర్టు ఫొటోలు అతికించి, గెజిటెడ్ ఆఫీసర్‌తో ధ్రువీకరణ సంతకం తీసుకోవాలి.
Success Story: రాష్ట్ర కొలువుతో పాటు కేంద్ర కొలువు కొట్టానిలా.. కానీ ఉద్యోగంలో చేరిన ఆరు నెలలకే..
☛ Dream Successful: యువకుడి గెలుపుతో ఊరుంతా సంబరం
ఈ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను పొందుపరిచి అక్టోబర్ 12,13 తేదీల్లో నిర్దేశిత కేంద్రాల్లో సమర్పించాలి. సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లు అక్టోబర్ 12న ఎస్పీ/ కమిషనర్ కార్యాలయాల్లో, ఎస్పీఎఫ్, ఎస్‌ఏఆర్, మెకానిక్, ట్రాన్స్‌పోర్టు (హెచ్‌ఓ) కానిస్టేబుళ్లు అక్టోబర్ 13న హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంలో, మిగిలిన అభ్యర్థులు 13న ఆయా జిల్లాల ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయాల్లో అటెస్టేషన్ ఫారంలు సమర్పించాలి.
☛ Constables Success Stories : ఈ ఆరుగురు కానిస్టేబుల్స్.. ఎస్‌ఐ ఉద్యోగాలు కొట్టారిలా..
ఎంపికైనవారు..
పోస్టు |
నోటిఫైడ్ ఖాళీలు |
ఎంపికైనవారు |
సివిల్ |
4965 |
3298/1622 |
ఏఆర్ |
4423 |
2982/948 |
ఎస్‌ఏఆర్‌సీపీఎల్ (మెన్) |
100 |
100/–– |
టీఎస్‌ఎస్‌పీ (మెన్) |
5010 |
4725/–– |
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (మెన్) |
390 |
382/–– |
ఫైర్‌మెన్ |
610 |
599/–– |
వార్డర్ (మేల్) |
136 |
134/–– |
వార్డర్ (ఫిమేల్) |
10 |
––/10 |
ఐటీ, కమ్యూనికేషన్స్ |
262 |
171/86 |
మెకానిక్ (మెన్) |
21 |
21/–– |
ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ (హెచ్‌ఓ) |
6 |
4/2 |
ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ (ఎల్‌సీ) |
57 |
44/13 |
ఎక్సైజ్ |
614 |
406/203 |
మొత్తం |
16604 |
12866/2884 |
☛Chandrakala, IAS: ఎక్కడైనా సరే..‘తగ్గేదే లే’
తుది రాత పరీక్షలు క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో సందేహాలు, వాటిని నివృత్తికి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు అవకాశం కల్పించింది. అక్టోబర్ 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అభ్యర్థుల లాగిన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ స్థానికులైన ఎస్సీ, ఎస్టీలు రూ.1000, ఇతరులు రూ.2000 ఫీజు చెల్లించాలి. కేవలం ఆన్‌లైన్ ద్వారానే ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకోవాల్సి ఉంటుందని, ఎలాంటి వ్యక్తిగత వినతులకు అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది.
☛Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ కసితోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..
☛Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..
Tags
- ts police constable success story
- ts police constable two sisters success story in telugu
- ts police constable success stories
- Competitive Exams Success Stories
- Success Stories
- Inspire
- police success story in telugu
- Inspire 2023
- motivational story in telugu
- Police Story
- constable success stories 2023
- Final Selection Results
- Sakshi Education Success Stories
- motivational story
- Inspiring Women Success Story