Selected for SI Post: ఉద్యోగంలో విధులు నిర్వహిస్తూనే ఎస్ఐగా ఎంపిక
పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామంలోని వ్యవసాయ కుటుంబానికి చెందిన కూస హైమ–మల్లయ్య దంపతుల కుమారుడు వినయ్ ఎస్సై పోస్టుకు ఎంపికయ్యారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో వినయ్ ప్రతిభ చూపారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి కష్టపడి ఉద్యోగం సాధించినట్లు వినయ్ తెలిపారు. తల్లిదండ్రుల సహకారంతో తాను ఈ కొలువు సాధించినట్లు తెలిపారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఎస్సైగా ఎంపికైనందుకు ఆనందంగా ఉందన్నారు.
Dream Successful: యువకుడి గెలుపుతో ఊరుంతా సంబరం
కాగా, తన కుమారుడు ఎస్సై కావడం సంతోషంగా ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. అలాగే, వినయ్.. ఎస్సై పోస్టుకు ఎంపిక కావడంపై గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వినయ్ అంతకుముందే రెండు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యురిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్), రైల్వే గ్రూప్–డీ లో ఉద్యోగాలను సాధించారు. ప్రస్తుతం రైల్వే గ్రూపు డీ లో విధులు నిర్వర్తిస్తూ ఎస్సై పోస్టుకు ఎంపికయ్యారు.