Dream Successful: యువకుడి గెలుపుతో ఊరంతా సంబరం
మండలంలోని మల్లంపల్లి గ్రామానికి చెందిన బూర నారాయణ, శోభారాణి దంపతులది నిరుపేద కుటుంబం. కూలీకి వెళ్తేగాని పూటగడవదు. అలాంటి వారి ఇంట్లో వెలుగులు నిండాయి. ఆ దంపతుల కుమారుడు రఘుబాబు టెన్త్ వరకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలోనే చదివాడు. మాసాబ్‌టాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చేశాడు. బీటెక్ చదవడానికి డబ్బు సరిపడలేదు. దీంతో ఓపెన్ డిగ్రీ చేశాడు. ఈ సమయంలోనే మండల కేంద్రంలోని గ్రంథాలయంలో చదువుకునే వాడు.
Constable Posts Achievers: యువకులు కానిస్టేబుల్ గా విజయం
తనకు ఎస్సై కావాలనే ఆశ పట్టుదల ఉండడంతో ఆ దారిలోనే ముందుకు సాగి ప్రయాణం చేశాడు. అతని కృషి, కుటుంబ సహకారంతో చదివి, మొదటి ప్రయత్నంలోనే కొలువు సాధించాడు. ఎస్‌పీఎఫ్ విభాగంలో ఎస్సై ఉద్యోగం సాధించాడు. దీంతో నిరుపేద ఇంట్లో వెలుగు నిండింది. ఈ విషయం తెలుసుకున్న ఈ యువకుడి తల్లిదండ్రులు ఎంతో గర్వించి, తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు తమ కుమారుడిని అభినందించారు. ఈ విజయంతో వారి ఇల్లే కాదు, ఊరంతా ఆనందంతో సంబురాలు చేసుకుంది.