Skip to main content

Twin Police Brothers: ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఎస్సై కవలల విధులు

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం ముల్కల్ల ఐజా కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో జూన్ 4న‌ ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది.
Duties of SI Twins in Vote Counting Centre  Twins Gopati Suresh and Gopati Naresh from 2020 batch performing election duties together at Mulkalla Aiza College, Hajipur mandal

హాజీపూర్‌ ఎస్సై గోపతి సురేశ్‌, తాళ్లగురిజాల ఎస్సై గోపతి నరేశ్‌ ఒకే చోట విధులు నిర్వర్తించారు. ఇక్కడే అసలు విషయం ఉంది. 2020 బ్యాచ్‌కు చెందిన వీరిద్దరూ స్వయంగా సోదరులు. పైగా కవలలు కూడా. వీరిద్దరూ ముల్కల్లలో లోక్‌సభ ఎన్నికల విధుల్లో భాగస్వాములు కాగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తూ ప్రత్యేకంగా నిలిచారు.

చదవండి: 2022 Constables: 2022 కానిస్టేబుల్‌ అభ్యర్థులను శిక్షణకు పంపించాలి: ఆర్‌.కృష్ణయ్య

ఇద్దరూ ఒకేలా ఉండటంతో గుర్తించడం తోటి ఉద్యోగులను కాస్త ఇబ్బంది పెట్టింది. వీరు ఎస్సైలు కాక ముందు ఇద్దరు కూడా గుడిపేట 13వ ప్రత్యేక పోలీస్‌ బెటాలియన్‌లో కానిస్టేబుళ్లుగా పని చేయడం కొసమెరుపు. వీరి తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి–శంకరయ్య కాగా, వీరి పెద్ద సోదరుడు రవీందర్‌ కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ సీఐ, రెండో సోదరుడు వెంకటేశ్‌ గోదావరిఖని వన్‌టౌన్‌లో కానిస్టేబుల్‌గా, మూడవ సోదరుడు సంతోష్‌ గోదావరిఖని 2 ఇంక్‌లైన్‌లో పని చేస్తున్నారు.

వీరి దివంగత తండ్రి శంకరయ్య రిటైర్డ్‌ ఉద్యోగి. కాగా, కుటుంబంలో అంతా ఉద్యోగులు కావడం విశేషం.

Published date : 05 Jun 2024 04:47PM

Photo Stories