Success Achievement: ఉద్యోగానికి సెలవు.. ఎస్ఐగా ఎంపిక
తన చదువుని కష్టపడి పూర్తి చేసి, అందుకు తగ్గిన ఫలితంగా ఉద్యోగాన్ని సాధించాడు ఈ యువకుడు. తన ఉద్యోగంలో చేరి, విధులను నిర్వహించిన కొంత సమయానికే తనకు ఏదో వెలితి ఎదురైంది. పొందిన ఉద్యోగంలో ఎదో తక్కువైందని దిగులుతో ఇంకేదో సాధించాలని ఆశించి తను నిర్వహించే విధులకు సెలవును ప్రకటించి ముందుకు సాగాడు. ఇక ఆ ముందు ప్రయాణంలో తను తీసుకున్న నిర్ణయం, తన గెలుపు ఎలా జరిగిందో తెలుసుకుందాం..
Youth Achieves SI Post: విద్య సాధనతో గెలుపు సొంతం
అనంతరం కష్టపడి చదివి అనుకున్న లక్ష్యం సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కాని, ఆ ఉద్యోగానికి సెలవు పలికి ఇలా పోలీస్ శాఖలో చేరాలనే ఆసక్తి చూపిన ఈ యువకుడు, ఖానాపురం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన బండారి మల్లయ్య, ఐలమ్మ దంపతుల కుమారుడు శివ. ఇతను 2016లో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం గంగారం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో తనతో పాటు 2016లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక కాని వారు మరో ప్రయత్నంలో ఎస్సై ఉద్యోగం సాధించారు.
Solider as SI: సైనికాధికారి ఇప్పుడు ఎస్ఐ అధికారిగా
దీంతో తాను కూడా ఎస్సై ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగాడు. చదువు కోసం ఇబ్బందులు ఏర్పడుతున్నాయనే కారణంతో మూడు నెలలు విధులకు సెలవు తీసుకున్నారు. హనుమకొండలో ఓ గదిలో ఉంటూ సెంట్రల్ లైబ్రరీలో చదువుకున్నాడు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో 242 మార్కులు సాధించి ఎస్సై పోస్టుకు ఎంపికయ్యారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందం నెలకొంది. కాగా, గ్రూప్–1 సాధించడమే లక్ష్యమని, ప్రిలిమ్స్ అర్హత సాధించినట్లు శివ తెలిపారు.