Skip to main content

Youth Achieves SI Post: విద్య‌ సాధ‌న‌తో గెలుపు సొంతం

ల‌క్ష్యం ఎంచుకున్నా.. దానికి మ‌న కృషి, సాధ‌న, ప‌ట్టుద‌ల తోడైతే విజ‌యం ఎప్ప‌టికైనా మ‌న సొంతం అవుతుంద‌ని ఈ యువ‌కులు నిరూపించారు. ఈ క్ర‌మంలోనే ఒకే గ్రామానికి చెందిన ప‌లు యువ‌కులు, మ‌రో గ్రామానికి చెందిన యువ‌తీయువ‌కులు, త‌మ కృషి, ప‌ట్టుద‌ల‌తో వారు పొందిన ఉద్యోగం చేస్తూనే వారు మెచ్చిన దారిలో న‌డిచి అనుకున్న ల‌క్ష్యాన్ని చేరి, వారి త‌ల్లిదండ్రుల‌ను సంతోష‌పెట్టారు. న‌లుగురికి స్పూర్తిగా నిలిచారు.. వారి వివ‌రాల‌ను తెలుసుకుందాం..
Students achieves SI post
Students achieves SI post

టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఆదివారం విడుదల చేసిన ఎస్‌ఐ తుది ఫలితాల్లో కడ్తాల్‌ మండలానికి చెందిన పలువురు యువకులు ఎస్‌ఐ ఉద్యోగానికి ఎంపికయ్యారు. మండల కేంద్రానికి చెందిన నార్లకంటి రాంచంద్రయ్య సాలమ్మ దంపతుల కుమారుడు నార్లకంటి శ్రీశైలం సివిల్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యారు. ప్రస్తుతం శ్రీశైలం అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.

SI

అలాగే, కడ్తాల్‌కు చెందిన మంకాల శ్రీనివాస్‌గౌడ్‌ కుమారుడు సునీల్‌గౌడ్‌ ఏఆర్‌ఎస్‌ఐగా ఎంపికయ్యారు.

SI

మండల పరిధిలోని గానుగుమార్ల తండాకు చెందిన నర్సింగ్‌, సాలి దంపతుల కుమారుడు మునేశ్‌నాయక్‌ ఏఆర్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యారు.

SI

చరికొండ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు సివిల్‌ ఎస్‌ఐలుగా ఎంపికయ్యారు. చరికొండకు చెందిన జంగమ్మ కుమారుడు గౌర శ్రీకాంత్‌ , గజ్జె ముత్యాలు కుమారుడు లింగంగౌడ్‌, చిందం బీరయ్య కుమారుడు చింద శ్రీను సివిల్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యారు.

SI

ఒకేసారి మండలంలో పెద్ద సంఖ్యలో యువకులు ఎస్‌ఐ ఉద్యోగం సాధించడం పట్ల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మూడో ప్ర‌య‌త్నంలో విజ‌యం.. ఎలా?

SI

తెలంగాణ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఎస్‌ఐ ఫలితాల్లో ఆమనగల్లుకు చెందిన ఉప్పల పర్వతాలు, మణమ్మల కుమార్తె ఉప్పల సునీత ఎస్‌ఐగా ఎంపికైంది. గతంలో సునీత పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికైనప్పటికీ ఎస్‌ఐగా ఎంపిక కావాలని లక్ష్యంతో కానిస్టేబుల్‌ ఉద్యోగం వదులుకుంది. రెండవ ప్రయత్నంలో అరమార్కుతో ఎస్‌ఐ ఉద్యోగం కోల్పోయింది. తిరిగి మూడవ ప్రయత్నంలో ఎస్‌ఐగా ఎంపికైంది. ఈ సందర్భంగా సునీతను పలువురు అభినందించారు.

ఎస్‌ఐ పోస్టుకు ఎంపికైన మాల్‌ యువకుడు

SI achiever

ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఎస్‌ఐ ఫలితాల్లో యాచారం మండలం మాల్‌ గ్రామానికి చెందిన ఎండీ సోహల్‌ సివిల్‌ ఎస్‌ఐ పోస్టుకు ఎంపికయ్యాడు. ఎండీ గౌసీయాబేగం, అబ్దుల్‌ సత్తార్‌ రెండో కుమారుడైన ఎండీ సోహల్‌కు 2018లో రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఎస్‌ఐ పోస్టుపై మమకారంతో క‌ష్టం, శ్ర‌ద్ద‌తో చదివి, అనుకున్న‌ట్లుగానే ల‌క్ష్యాన్ని చేరి, సివిల్‌ ఎస్‌ఐగా ఎంపికయ్యాడు.

ఎస్‌ఐ పీటీఓ పోస్టు సాధించిన డానియేల్‌

SI

మండలంలోని లేమూరుకు చెందిన చింతకింద డానియేల్‌ పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (పీటీఓ) పోస్టు సాధించాడు. ఎస్‌ఐ మెయిన్స్‌ పరీక్షా ఫలితాలు ఆదివారం సాయంత్రం విడుదలైయ్యాయి. ఫలితాల్లో డానియేల్ ఎంపిక‌య్యాడు. కాగా, డానియేల్‌కు ఇటీవల సౌత్‌ సెంట్రల్‌ రైల్వేలో పాయింట్స్‌ మెన్‌గా సైతం ఉద్యోగం రాగా, ప్రస్తుతం రెండు నెలల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టు సాధించడంతో అతని కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. డానియేల్‌ అన్న రాజ్‌కుమార్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఐటీ విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. ముగ్గురు అక్కల్లో ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లుగా, ఒకరు కానిస్టేబుల్‌గా, మరో అక్క ప్రైవేట్‌ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తుంది.

Published date : 02 Oct 2023 04:35PM

Photo Stories