Solider as SI: సైనికాధికారి ఇప్పుడు ఎస్ఐ అధికారిగా
దేశాభిమానం ఆయనను 17 సంవత్సరాల వయస్సులోనే సైనికుడు అయ్యేలా చేసింది. సైనికుడిగా..సైనికాధికారిగా 18 ఏళ్లు దేశ సరిహద్దులలో పనిచేశారు. అక్కడ, ఆయన సేవలను దేశానికి కొన్ని సంవత్సరాలపాటు అందించారు. ఇదిలా ఉంటే, అతనికి ప్రజాసేవ చేయాలనే పట్టుదల ఎక్కువ ఉండడంతో, అనంతరం ప్రజలలో ఉంటూ సేవ అందించాలని భావించి, అందుకు పోలీస్ అధికారిగా నిలవాలన్న తపనతో తాను నిరంతరం కష్టపడి ఎస్ఐ పరీక్షల కోసం చదివాడు.
Young Woman Achieves SI Post: తొలి ప్రయత్నంలోనే ఎంపికైంది ఈ యువతి.. ఎలా?
ఫలితాలానుసారం అనుకున్న లక్ష్యానికి చేరుకున్నారు ఈ సైనికుడు. ఆయనే పరకాల పట్టణానికి చెందిన రిటైర్డ్ సైనికాధికారి పిట్ట రాజేష్. ఆదివారం వెలువడిన ఫలితాల్లో సివిల్ ఎస్సై పోస్టుకు ఎంపికయ్యారు. ఈ వార్తతో ఆయన చేయాలనుకున్న సేవలను అధికారికంగా చేయవచ్చని సంతోషించారు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు ఆనంద సాగరంలో మునిగారు.