Success Story of Young Farmer Rajeev Bhaskar : ఉన్నత ఉద్యోగానికి వదిలి.. రైతుగా ఎదిగిన ఈ యువకుడు.. ప్రస్తుతం కోట్లల్లో సంపద..! ఇదే ఇతని సక్సెస్ స్టోరీ..
సాక్షి ఎడ్యుకేషన్: ఒకరికి ఆత్మ విశ్వాసం ఉండి దానికి తగ్గిన శ్రమ తోడైతే గెలుపు ఎప్పటికైనా సొంతం అవుతుంది. నడిచే దారి, చేసే ఉద్యోగమైనా, వ్యాపారమైనా చిన్నదైనా, పెద్దదైనా ఇష్టంగా చేయాలే కాని గమ్యం ఎంత దూరంలో ఉన్న చేరుకోగలం ఈ వాక్యాలన్నింటినీ నిజమేనని నిరూపించాడు ఒక యువకుడు. అది ఎలాగో తెలుసుకుందామా.. అయితే, ఈ కథ చదవండి..
చేతిలోని ఉద్యోగం వదిలి..
చాలామంది విద్యార్థులు వారి చదువును పూర్తి చేసుకొని రోజుకు 10 ఇంటర్వ్యూలకు వెళ్తే ప్రతీ దానిలో ఏదో ఒక కారణంతో రిజెక్ట్ అవుతున్నారు. ఎంతో కష్టపడితే కాని, యువతకు ఈ మధ్య కాలంలో ఎంత చదువున్న, ఎంత తెలివి ఉన్న అంత సులువుగా ఉద్యోగం దక్కడం లేదు. కాని, హరియానాకు చెందిన ఈ యువకుడు రాజీవ్ భాస్కర్.. నైనిటాల్‌లో జన్మించాడు. తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామ చేశాడు. తన సొంత కాళ్లపై నిలవాలని తాను చేస్తున్న ఉద్యోగం వదిలి తన ఊరిలోనే ఒక వ్యాపారం ప్రారంభించాడు. సీడ్స్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు సేకరించిన నైపుణ్యం ఏదో ఒక రోజు తనను సంపన్న రైతు, పారిశ్రామికవేత్తగా మార్చడానికి సహాయపడుతుందని ఊహించలేదు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఉద్యోగం వదిలి.. రైతుగా ఎదిగి..
ప్రతీ యువత తమ సొంత కాళ్లపైనే నిలవాలనుకుంటుంది. అది ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా. అందులో రైతుగా కొందరు యువత కూడా ఎదగాలనుకుంటారు. ఈ రంగానికి చెందివాడే భాస్కర్. 2017లో తన ఉద్యోగానికి రాజీనామ చేసి వ్యాపారంలో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. తన ఊళ్లోనే ఉన్న పంటలో సాగు చేస్తూ రైతుగా మారాడు. చేసే ఎటువంటి పనిలోనైనా లాభం కన్నా ఆనందాన్ని చూడాలని నిరూపించాడు. ఇందులో కూడా తనకు ఉద్యోగంలో రాని లాభం లభించింది.
DSC Topper : టీఎస్ డీఎస్సీలో టాపర్‌గా నిలిచిన రెంటచింతల యువకుడు.. ఇదే ఇతని సక్సెస్ స్టోరీ...
రైతులతో మాట్లాడే అవకాశం..
వీఎన్‌ఆర్ సీడ్స్ కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్‌లో సభ్యుడిగా దాదాపు నాలుగు సంవత్సరాల పాటు పని చేసినప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది రైతులతో మాట్లాడే అవకాశం లభించిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వారు అతనికి వ్యవసాయం పరిధిని అర్థం చేసుకోవడంలో సహాయపడి, వ్యవసాయం ప్రారంభించడానికి అతనిని ప్రేరేపించారని చెప్పుకొచ్చారు. తాను బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసిన డిగ్రీ ఉన్నప్పటికీ వ్యవసాయం గురించి ఏమీ తెలియక పలు రైతులతో ముఖాముఖి జరిపేవారట.
భాస్కర్ ఎంబీఏ పూర్తి చేసినప్పటికీ వ్యవసాయంలో తనకు ఉన్న ఇష్టం, విత్తనాలలో తనకు ఆసక్తి పెరగడంతో ఈ రంగంలోకి రాణించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
కొత్త పద్ధతులతో..
2017లో తీసుకున్న తన నిర్ణయానికి తగ్గట్టే వ్యవసాయంలోకి అడుగు పెట్టాడు. కాని, అందరిలా కాకుండా కొందరు మాత్రమే అనుసరించే సేంద్రీయ పద్ధతిని ఎంచుకున్నాడు. ఈ పద్ధతి భాస్కర్‌కు చాలా మంచితోపాటు ఎంతో లాభాన్ని కూడా తెచ్చి పెట్టింది. జామ పండ్లను సాగు చేయడం ప్రారంభించాడు. మొదట ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని జామ పండ్లను సాగు చేశాడు. దీంతో భాస్కర్‌కి కొన్ని లక్షల రూపాయలలో లాభం వచ్చింది. సేంద్రియ పద్దతిలో జామ పంటను సాగు చేయడం వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందగలిగాడు. ఇలా, సంవత్సరానికి 20 లక్షల లాభం పొందేవాడు.
'థాయి' రకం జామ
పంజాబ్‌లోని రూపనగర్‌లో 55 ఎకరాల భూమిని భాస్కర్ అద్దెకు తీసుకున్నాడు. ఇక్కడ తను థాయి రకం జామ పండ్లను పండించాలి నిర్ణయించుకున్నాడు. ఇందులో ఒక 25 ఎకరాల్లో థాయి జామ పంటలు వేశాడు కాని, లాభం మాత్రం అనుకున్న దాని కన్న ఎక్కువే వచ్చింది. దీంతో రోజు రోజుకు తన లాభాలు పెరిగిపోయాయి. ఇలా, నెమ్మదిగా లాభాలు ఎక్కువ పొందడం ప్రారంభం అయ్యింది. జామ తోటలను అద్దెకు తీసుకుని వాటిని సాగు చేసి.. కోట్ల రూపాయల ఆదాయం పొందడం ఇతని ప్రత్యేకత.
ఉపాధి అవకాశాలు..
తన ప్రత్యేకత కారణంగా వ్యాపారంలో ఎంతో లాభం వచ్చింది. ఇతను పూర్తిగా సేంద్రియ పద్దతిలోనే ఎరువులను వాడుతూ.. పంటను సాగు చేశాడు.
ఈ పద్దతిని అనుసరించడం ద్వారా.. ఎకరానికి ఆరు లక్షల వరకు లాభం పొందవచ్చని అతను తెలియజేశాడు. ప్రస్తుతం ఇతని పంట లాభాల బాటలో కొనసాగుతుంది. దీంతో భాస్కర్ మరి కొందరికి ఉపాధిని అందించే స్థాయికి ఎదిగాడు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
ఇలా, అందరిలా కాకుండా తాను సొంతంగా, ప్రత్యేకతతో ఆలిచించి ముందుకు వెళ్లడం అందరి వల్ల సాధ్యం కాదు. ఇటువంటి పనిలో లాభాలు ఎంత వస్తాయో అప్పుడప్పుడు నష్టాలు అంతే వస్తాయి. లాభం వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తామో, నష్టం వచ్చినప్పుడు కూడా అంతే ధైర్యంగా ఉండాలి.
Tags
- success story of young farmer
- Rajeev Bhaskar Success story
- inspiring stories for unemployed youth
- success and inspiring stories of youth
- Young Farmer Rajeev Bhaskar
- Young farmer rajeev bhaskar success story
- bsc agriculture student success story
- Rajeev bhasker as young farmer news in telugu
- success stories of youngsters in telugu
- latest success stories in telugu
- young man turns farmer success story
- motivational stories of young persons achievements
- young achievements stories
- rajeev bhaskar success story
- farmers success stories
- indian farmers struggles
- lessons from farmers
- young farmer rajeev bhaskar success story
- farming education for youngsters
- youngsters success stories
- young farmer success story in telugu
- Education News
- Sakshi Education News
- latest success stories in sakshi education