Group-4: ఏపీపీఎస్సీ గ్రూప్ 4 హాల్‌టికెట్లు విడుదల... ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు psc.ap.gov.in వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏపీ రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్(గ్రూప్ 4) ఉద్యోగ నియామకాలకు సంబంధించి మెయిన్స్ పరీక్షను ఏప్రిల్ 4న నిర్వహించనున్నారు.
రెండు షిఫ్టుల్లో పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు 11,574 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. పరీక్షకు కేవలం వారం రోజుల గడువే ఉండడంతో ఇంపార్టెంట్ టాపిక్స్‌ను మళ్లీ రివిజన్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. హాల్ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
చదవండి: ఏపీపీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్.. వివరాలు
ఏపీపీఎస్సీ: స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ
Published date : 28 Mar 2023 04:01PM