TSPSC Group-1 Mains: గ్రూప్స్-1 మెయిన్స్‌కి ఇవి చదివితే.. కొలువు మీదే..!
ఇంటర్వ్యూల రద్దుతో రెండంచెల(ప్రిలిమ్స్, మెయిన్స్) విధానంలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్స్-1 మెయిన్ పరీక్ష స్వరూపం, ప్రిపరేషన్ వ్యూహాలపై ప్రత్యేక కథనం.. మీకోసం..
TSPSC Group-1 Prelims: గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు ఇలా ప్రిపేరయ్యారంటే..?
మెయిన్ రాత పరీక్ష ఇదే..:
దీనిలో జనరల్ ఇంగ్లిష్ అర్హత పరీక్షతోపాటు పేపర్–1(జనరల్ ఎస్సే),పేపర్–2(హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ), పేపర్–3(భారత సమాజం, రాజ్యాంగం, పాలన), పేపర్–4(ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్), పేపర్–5(సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్), పేపర్–6(తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం) అనే మరో ఆరు పేపర్లుంటాయి. ఒక్కో పరీక్ష కాలవ్యవధి మూడు గంటలు, ప్రతి పరీక్ష మార్కులు 150. జనరల్ ఇంగ్లిష్ పదోతరగతి స్థాయిలో ఉంటుంది. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో ముద్రించిన ప్రశ్నపత్రాల స్థానంలో ఎలక్ట్రానిక్ ప్రశ్నపత్రం (ఇ–క్వశ్చన్ పేపర్)ను ప్రవేశ పెట్టనున్నారు.
Books for Groups Preparation: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..
మెయిన్స్‌కి ఇవి చదివితే ఈజీనే..
➤ పేపర్–1(జనరల్ ఎస్సే): దీనిలో మూడు సెక్షన్లలో మూడు చొప్పున ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో ఒక్కో ప్రశ్నను ఎంచుకుని అభ్యర్థులు మొత్తం మూడు ఎస్సేలు రాయాలి. ఒక్కో ఎస్సేకు 50 మార్కులు. సెక్షన్–1లో సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు, ఆర్థిక వృద్ధి, న్యాయ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్–2లో దేశ రాజకీయాలు, భారతదేశ చారిత్రక, సాంస్కృతిక వారసత్వంపై ఎస్సేలు రాయాల్సి ఉంటుంది. సెక్షన్–3లో సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, మానవ వనరుల అభివృద్ధిపై ప్రశ్నలు అడుగుతారు. కరెంట్ అఫైర్స్‌పై ఎక్కువ దృష్టిసారించడం, రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ తాజా పరిణామాలను నిశితంగా పరిశీలించడం ద్వారా ప్రస్తుత సమస్యలను పరిశీలిస్తూ.. ప్రతిరోజు పేపర్, టీవీలో వచ్చే వార్తల ద్వారా నాలెడ్జ్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.
➤ పేపర్–2 (హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ)లో భారతదేశ చరిత్ర, సంస్కృతి, తెలంగాణ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, భారతదేశ, తెలంగాణ భౌగోళిక శాస్త్రంపై ప్రశ్నలు అడుగుతారు.
➤ పేపర్–3 (భారత సమాజం, రాజ్యాంగం, పాలన)లో భారతీయ సమాజం, నిర్మాణం, సమస్యలు, సామాజిక ఉద్యమాలు, భారత రాజ్యాంగం, పాలనపై ప్రశ్నలు ఇస్తారు.
➤ పేపర్–4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్)లో ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్, తెలంగాణ ఎకానమీ, అభివృద్ధి, పర్యావరణ సమస్యలపై ప్రశ్నలు ఉంటాయి.
➤ పేపర్–5 (సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్)లో సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర, ప్రభావం, శాస్త్ర పరిజ్ఞానం అనువర్తనాల్లో ఆధునిక పోకడలు, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ ప్రాబ్లం సాల్వింగ్‌పై ప్రశ్నలు అడుగుతారు.
➤ పేపర్–6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం)లో తెలంగాణ భావన (1948–1970), సమీకరణ దశ(1971–1990), తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశ(1991–2014)పై ప్రశ్నలు ఇస్తారు.
Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!
ఎంపిక విధానం ఇలా..
గ్రూప్–1 మెయిన్ ఎగ్జామినేషన్‌లో కనీసం 40 శాతం(బీసీ అభ్యర్థులు 35 శాతం,ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగ అభ్యర్థులు 30శాతం) మార్కులు సాధించి.. మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. తర్వాత దశలో ఆయా అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అర్హతలకు అనుగుణంగా శాఖల్లో పోస్టింగ్ ఇస్తారు.