Library Staff Jobs: గ్రంథాలయాల్లో ఖాళీలు భర్తీ అయ్యేనా.. మొత్తం ఖాళీలు ఇవే!

సిబ్బంది లేక ఇక్కట్లు..
జిల్లా వ్యాప్తంగా 29 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిల్లో గ్రేడ్–1 గ్రంథాలయం నల్లగొండలో ఉండగా, గ్రేడ్–2 గ్రంథాలయాలు మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్‌లో ఉన్నాయి. మిగిలినవి గ్రేడ్–3 గ్రంథాలయాలు. ఆయా గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలతో పాటు అన్నిరకాలవి కలిపి లక్షన్నర పైచిలుకు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
ఆయా గ్రంథాలయాలకు సుమారు 2లక్షల మందికిపైగా పాఠకులు వస్తున్నారు. ఈ గ్రంథాలయాల్లో మొత్తం 43 మంది సిబ్బంది అవసరం ఉండగా ప్రస్తుతం లైబ్రేరియన్లు, అటెండర్లు, వాచ్‌మెన్లతో కలిసి మొత్తం 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొన్ని గ్రంథాలయాల్లో లైబ్రేరియన్లు లేకపోవడంతో నిర్వహణ కష్టతరంగా మారింది.
![]() ![]() |
![]() ![]() |
పెరుగుతున్న పాఠకుల రద్దీ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తుండడంతో ఆయా పరీక్షలకు ప్రిపేరయ్యే వారితో పాటు రోజు వారీ పాఠకులతో గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3 గ్రంథాలయాల్లో రద్దీ పెరుగుతోంది. గతంలో నిర్వహించిన పోటీ పరీక్షల్లో కొద్ది మార్కులతో ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయిన నిరుద్యోగులు మరింత పట్టుదలతో గ్రంథాలయాల్లోనే కూర్చొని చదువుతున్నారు.
కోచింగ్ సెంటర్లకు వెళ్లాలంటే వేలాది రూపాయలు ఖర్చు అవుతుండడం.. గ్రంథాలయాల్లో అన్నిరకాల పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉండడం.. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగ యువత గ్రంథాలయాల బాట పడుతోంది. అయితే రెగ్యులర్ సిబ్బంది లేకపోవడం.. ఇన్‌చార్జ్‌లతోనే కొన్ని గ్రంథాలయాలను నడపుతుండడంతో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. దీంతో పాఠకుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికై నా ఖాళీ పోస్టులను భర్తీ చేసి గ్రంథాలయాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని పాఠకులు కోరుతున్నారు.
ఖాళీలపై ప్రభుత్వానికి నివేదిక అందించాం
జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల్లో ఖాళీ పోస్టుల వివరాలు సేకరించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపించాం. రానున్న ఉద్యోగ క్యాలెండర్‌లో గ్రంథాలయాల్లో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్, ఇతర పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండనుంది.
– బాలమ్మ, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి, నల్లగొండ
ఖాళీల వివరాలు ఇలా..
ఉద్యోగాలు |
ఖాళీ పోస్టులు |
గ్రేడ్–1 లైబ్రేరియన్లు |
01 |
గ్రేడ్–2 లైబ్రేరియన్లు |
03 |
గ్రేడ్–3 లైబ్రేరియన్లు |
15 |
అటెండర్లు |
04 |
వాచ్‌మన్లు |
05 |