Systems Engineering Summit: ఎస్‌ఆర్‌ఎంలో సిస్టమ్స్ ఇంజినీరింగ్ సమ్మిట్

వర్శిటీలోని అబ్దుల్‌కలామ్ ఆడిటోరియంపై వైస్ చాన్సలర్ ఆచార్య మనోజ్‌కుమార్ అరోరా జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మిట్‌ను ప్రారంభించారు. ఈ సమ్మిట్‌కు రాష్ట్రంలోని వివిధ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓలు, పరిశోధన రంగానికి చెందిన పలువురు నిపుణులతోపాటు ఎఫ్తానిక్స్ సిస్టమ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వైస్ చాన్సలర్ మనోజ్ మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ సిస్టమ్స్ ఇంజినీరింగ్ ప్రాధాన్యం పెరిగిందని, వివిధ పరిశ్రమలు సిస్టమ్స్ ఇంజినీరింగ్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో యూనివర్శిటీలూ పాఠ్యప్రణాళికను తదనుగుణంగా మార్చుకోవాలన్నారు.
చదవండి: ఇంజనీరింగ్ - జాబ్ గైడెన్స్ | ప్రాజెక్ట్ గైడెన్స్ | సక్సెస్ స్పీక్స్ | గెస్ట్ స్పీక్స్ | న్యూస్
ఎఫ్తానిక్స్ ఎండీ రామకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాలు సిస్టమ్స్ ఇంజినీరింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాయని, నూతన ప్రాజెక్టు ఆవిష్కరణకు ఇది దోహదపడుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్, మెషిన్ లెర్నింగ్ వంటి సాంకేతికత సిస్టమ్స్ ఇంజినీరింగ్‌లోనే ఉందన్నారు. అదేవిధంగా విద్యార్ధులకు ఈ రంగంలో వర్క్‌షాపులు, సెమినార్లు ఎంతో అవసరమన్నారు.
![]() ![]() |
![]() ![]() |
అనంతరం సిస్టమ్స్ ఇంజినీరింగ్ ప్రాధాన్యాన్ని తెలియజేసే వీడియోను ప్రదర్శించారు. ఎస్‌ఆర్‌ఎం, ఎఫ్తానిక్స్ మధ్య ఎంవోయూ జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజయవాడ వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ కళాశాల ప్రతినిధి డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, ఏపీ వీఐటీ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎస్‌వీ కోటారెడ్డి, విజ్ఞాన్ యూనివర్శిటీ వీసీ డాక్టర్ గంగాధరరావు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ అసోసియేట్ డీన్ డాక్టర్ మహేశ్వర్ ద్వివేది, ఈసీఈ హెచ్‌ఓడి సునీత తదితరులు పాల్గొన్నారు.