Good News: తెలంగాణ విద్యార్ధులకు, పేరెంట్స్ కు గుడ్ న్యూస్.. ఇకపై ఇక్కడ సీట్లలో 95 శాతం కేటాయింపు!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల్లో లోకల్, నాన్ లోకల్ కోటాపై ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది.

2025-2026 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థలలో రాష్ట్రంలోని స్థానిక విద్యార్థులు మెజారిటీ సీట్లను పొందబోతున్నారు. స్థానిక, స్థానికేతర ప్రమాణాలను నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ 95 శాతం సీట్లను తెలంగాణ స్థానికులకు ఇవాలని నిర్ణయించింది.
మిగిలిన 5 శాతం స్థానికేతర విద్యార్థులకు, రాష్ట్రం వెలుపల నివసిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, ఉద్యోగుల జీవిత భాగస్వాములకు రిజర్వ్ చేయబడుతాయి. అదనంగా ఆంధ్రపదేశ్ తో సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు జాతీయ సమైక్యత కోటా కింద మొత్తం సీట్లలో 10 శాతం సూపర్ న్యూమరీ ప్రాతిపదికన అవకాశం కల్పించబడుతుంది.
![]() ![]() |
![]() ![]() |

Published date : 14 Feb 2025 08:53AM