TG Rajiv Yuva Vikasam 2025 Application Begins: నిరుద్యోగులకు శుభవార్త.. రూ. 3 లక్షల వరకు ఆర్థిక సాయం..'రాజీవ్ యువ వికాసం' పథకం దరఖాస్తులు ప్రారంభం

అర్హత:
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు..
- తెలంగాణకు చెందిన స్థిర నివాసి అయి ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ లేదా మైనారిటీ వర్గానికి చెందిన వారు అయి ఉండాలి.
- దరఖాస్తు సమయంలో నిరుద్యోగిగా ఉండాలి.
- ఆధార్, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు వంటివి సమర్పించాలి.
అవసరమైన పత్రాలు (Required Documents):
- ఆధార్ కార్డ్
- తెలంగాణ నివాస ధృవీకరణ పత్రం
- కుల & ఆదాయ ధృవీకరణ పత్రాలు
- బ్యాంక్ ఖాతా వివరాలు
- రేషన్ కార్డ్
- ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ నమోదు
రూ.3 లక్షల వరకు రుణాలు :
రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద లబ్ధిదారులకు మూడు కేటగిరీ వారీగా రుణాలను మంజూరు చేయనుంది. కేటగిరీ-1 కింద రూ.లక్ష వరకు లోన్లను అందించనుంది. ఇందులో 80 శాతం రాయితీ ఉంటే, మిగతా 20 శాతం లబ్ధిదారుడు భరించడమో లేదా బ్యాంకు నుంచి రుణం తీసుకోవడమో ఉంటుంది. కేటగిరీ 2 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తారు. ఇందులో 70 శాతం రాయితీ ఉంటుంది. కేటగిరీ 3 కింద 60 శాతం రాయితీతో రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తారు.
సబ్సిడీ వివరాలు
రుణాలు | ప్రభుత్వ సబ్సిడీ | లబ్ధిదారుడి వాటా |
---|---|---|
₹1 లక్ష వరకు | 80% | 20% |
₹1–2 లక్షలు | 70% | 30% |
₹3 లక్షల వరకు | 60% | 40% |
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ tgobmms.cgg.gov.inను సందర్శించండి.
- మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీతో ఓ ఖాతాను తెరవండి.
- అవసరమైన డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయండి
- మీ దరఖాస్తు ఫారమ్‌ను చెక్‌చేసుకొని సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి
‘రాజీవ్ యువ వికాసం’ పథకం 2025 ముఖ్యాంశాలు:
👉మొత్తం బడ్జెట్: ₹6,000 కోట్లు
👉లబ్ధిదారులు: 5 లక్షల నిరుద్యోగ యువత
👉ఆర్థిక సహాయం: ప్రతి అర్హుడికి ₹3 లక్షల వరకు ఆర్థికసాయం
👉దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
👉అప్లికేషన్స్ ప్రారంభం: మార్చి 17 నుంచి
👉దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 5 వరకు
👉అప్లికేషన్ల వెరిఫికేషన్: ఏప్రిల్ 6 నుంచి మే 31 వరకు
👉మంజూరు పత్రాల అందజేత: జూన్ 2
Tags
- Telangana self employment scheme 2025
- Telangana Govt Scheme 2025
- Telangana Rajiv Yuva Vikasam Scheme 2025
- Unemployed Youth
- SC ST BC minority self employment scheme
- Rajiv Yuva Vikasam scheme
- JobOpportunities
- Rajiv Yuva Vikasam
- new schemes for unemployed youth
- jobs for unemployees
- How to Apply for Rajiv Yuva Vikasam
- schemes for youth
- Self Employment Scheme for Unemployed
- Telangana Self Employment Scheme Application Process
- Rajiv Yuva Vikasam Eligibility Criteria
- PrivateJobOpportunities
- TelanganaEmployment