Skip to main content

Inter Board Exam Mass Copying : ఇంట‌ర్ బోర్డు ప‌రీక్ష‌లో మాస్ కాపీయింగ్‌.. ప్రిన్సిపాల్ క్లారిటీ!!

ఇటీవల ఒక కాలేజీకి చెందిన విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా, శ్రీ వాసవి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వీడియో తీసినట్లు తెలిసింది.
Mass copying at ap intermediate board exam

చాగలమర్రి: నంద్యాల జిల్లా చాగలమర్రిలోని ఇంటర్మీడియెట్‌ పరీక్షా కేంద్రంలో విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. చాగలమర్రిలోని శ్రీ వాసవి జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఐదు కాలేజీలకు చెందిన విద్యార్థులు గత 15 రోజులుగా పరీక్షలు రాస్తున్నారు. ఇటీవల ఒక కాలేజీకి చెందిన విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతుండగా, శ్రీ వాసవి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వీడియో తీసినట్లు తెలిసింది. 

ఆ వీడియోను తమ కాలేజీ కరస్పాండెంట్‌కు ఆయన పంపినట్లు సమాచారం. దీంతో వాసవి కాలేజీ కరస్పాండెంట్‌ ఆ వీడియోను మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థుల కాలేజీ కరస్పాండెంట్‌కు పంపించి.. ‘మీ పిల్లలు ఎలా మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతున్నారో.. చూడండి..’ అని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆ వీడియా ప్రైవేట్‌ కాలేజీల యాజమాన్యాలు, కరస్పాండెంట్ల వాట్సాప్, ఇతర సోషల్‌ మీడియా గ్రూపుల్లోకి చేరినట్లు సమాచారం. 

Mistake in Inter Question Paper : ఇంట‌ర్ ప‌రీక్ష‌లో మ‌రో త‌ప్పిదం.. బోర్డు నుంచి స‌మాచారం..

ఈ వీడియోను ఒక కాలేజీ కరస్పాండెంట్‌ కొద్దిరోజుల కిందట ఆర్‌ఐవోకు పంపినట్లు తెలిసింది. వెంటనే ఆర్‌ఐవో సునీత స్పందించి ముగ్గురు అధికారులను తనిఖీల కోసం పంపించగా, వారికి ముడుపులు ముట్టచెప్పి అసలు వ్యవహారాన్ని గోప్యంగా ఉంచినట్లు సమాచారం. అయినా, ఆర్‌ఐవో ఆదేశాల మేరకు గత ఐదారు రోజుల నుంచి ఈ పరీక్ష కేంద్రంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. 

మాస్‌కాపీయింగ్‌ జరగలేదు: ప్రిన్సిపాల్‌ ఓబులేసు

తమ కాలేజీ గుర్తింపు రెన్యూవల్‌కు గడువు పూర్తికావడంతో అఫిలియేషన్‌ కొనసాగించేందుకు పరిశీలించడానికి ఆర్‌ఐవో సునీతతోపాటు త్రిసభ్య కమిటీ సభ్యులు వచ్చారని శ్రీ వాసవి కాలేజీ ప్రిన్సిపాల్‌ ఓబులేసు తెలిపారు. తమ కళాశాల పరీక్ష కేంద్రంలో ఎలాంటి మాస్‌కాపీయింగ్‌ జరగలేదని ఆయన చెప్పారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 17 Mar 2025 03:56PM

Photo Stories