AP & TS Inter Exams 2025 : ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం..! రిజల్డ్స్ ఎప్పుడంటే...?

ఈ మేరకు ఇంటర్ బోర్డ్ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.
మొత్తం నాలుగు విడతల్లో...
నాలుగు విడతల్లో జరిగే స్పాట్‌లో మొదటి విడతగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితం, సివిక్స్ పేపర్లను దిద్దనున్నారు. ఇప్పటికే సంస్కృతం పేపర్ వాల్యుయేషన్ మొదలైంది.
ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే...
స్పాట్ వాల్యుయేషన్‌కు హాజరయ్యేవారు సమయపాలన పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని, దిద్దుబాటులో జరిగే తప్పులు, దోషాలకు మూల్యం చెల్లించుకోకతప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సీసీ కెమెరాలను అమర్చి, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేశారు.
➤☛ Errors in Inter Question Paper : మూడు సబ్జెక్టుల్లో ఆరు తప్పులు.. ఇంటర్ విద్యార్థుల ఆందోళన..
ఇప్పటికే.. జిల్లాలకు చేరిన పరీక్ష పేపర్లు..
శ్రీకాకుళం జిల్లాకు 2.45 లక్షల జవాబుపత్రాలు చేరుకోనున్నాయి. ఇప్పటి వరకు 2 లక్షల జవాబుపత్రాలు చేరాయి. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 13 ప్రధాన సబ్జెక్టుల జవాబుపత్రాలు ఉన్నాయి. ఎగ్జామినర్ పూటకు 15 చొప్పున రోజుకు 30 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. పేపర్(స్క్రిప్ట్)కు రూ.23.66 పైసలు చెల్లిస్తారు. ఈ లెక్కన రోజుకు రూ. 709.66లు చెల్లించనున్నారు. వీటితోపాటు టీఏ, డీఏ, లోకల్ కన్వీయిన్స్/అవుట్‌స్టేషన్ అలవెన్స్ ఇలా చెల్లించే మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.
అన్ని సబ్జెక్టులకు కలిపి..
స్పాట్ వాల్యుయేషన్‌లో అన్ని సబ్జెక్టులకు కలిపి మూల్యాంకనంలో మొత్తం 1200 మంది యంత్రాంగం/సిబ్బందిని నియమించారు. క్యాంప్ ఆఫీసర్‌గా ఆర్‌ఐఓ ప్రగడ దుర్గారావు వ్యవహరిస్తున్నారు. ఏసీవో జనరల్-1 గణపతి వెంకటేశ్వరరావు (ఇన్‌చార్జి ప్రిన్సిపాల్- జీజేసీ శ్రీకాకుళం బాలురు), జనరల్-2గా (ఫిజిక్స్ జేఎల్- శ్రీకాకుళం బాలురు)తో పాటు సీసీవోలు, కోడింగ్ ఆఫీసర్లు, ఏసీవోలు, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్లు నియామక ప్రక్రియ పూర్తయ్యింది. స్పాట్ ఆర్డర్ నియామక ఉత్తర్వులు ఆయా కాలేజీల బీఐఈఏపీ లాగిన్‌లో డౌన్‌లోడింగ్‌కు అందుబాటులో ఉన్నాయి.
ఏపీలో సీసీ కెమెరాలతో పర్యవేక్షణలో...
➤☛ 1వ స్పెల్ మార్చి 17నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మాథ్స్, సివిక్స్
➤☛ 2వ స్పెల్ మార్చి 22 నుంచి ఫిజిక్స్, ఎకనామిక్స్, జీఎఫ్‌సి
➤☛ 3వ స్పెల్ మార్చి 24 నుంచి కెమిస్ట్రీ, హిస్టరీ
➤☛ 4వ స్పెల్ మార్చి 26 నుంచి కామర్స్, బోటనీ, జువాలజీ, బ్రిడ్జ్ కోర్సులు
➤☛ స్పెల్స్‌ను బట్టి విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. సమయపాలన పాటించాలి. సెల్‌ఫోన్‌లకు అనుమతిలేదు. సీసీకెమెరాలను అమర్చి, స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలాగే ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షిస్తారు.
తెలంగాణలో ఇప్పటికే...
తెలంగాణలో ఇప్పటికే ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంమైంది. నాలుగు విడతల్లో స్పాట్ వాల్యుయేషన్ చేస్తున్నారు. స్పాట్ కేంద్రాల్లో మరింత నిఘా పెంచేందుకు గానూ అన్నింటిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 25 వరకు కొనసాగే ఈ పరీక్షలకు 9.96 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు అటెండ్ కానున్నారు. ఈ సారి రిజల్డ్స్‌ను మాత్రం ఏపీలో కన్నా ముందుగా ఇవ్వాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. అన్ని కుదిరితే.. ఏప్రిల్ రెండు లేదా మూడో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ రెండోవారం లోపే ముగించేలా చర్యలు తీసుకుంటోంది.
ఇంటర్ మొదటి, రెండో సంవత్సర పబ్లిక్ పరీక్షల ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ ప్రక్రియ కోసం ఇంటర్ బోర్డు అధికారులు 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
దాదాపు 20000 మందితో..
తెలంగాణ ఇంటర్ బోర్డు సీఓఈ జయప్రదబాయి మాట్లడుతూ... గతేడాది 15 వేల మందితో ఈ ప్రక్రియ కొనసాగగా.. ఈ ఏడాది దాదాపు 20 వేల మందితో స్పాట్ వాల్యుయేషన్ చేస్తున్నారు అని తెలిపారు.
Tags
- TS Inter exams
- ts inter exams 2025 results
- ap inter exams 2025 results
- ap inter exams 2025 results release date
- ap inter spot valuation 2025
- ap inter spot valuation 2025 news telugu
- intermediate spot valuation 2025
- intermediate spot valuation 2025 news telugu
- ap inter result 2025
- ap inter result 2025 news telugu
- ts intermediate results 2025
- ts intermediate results 2025 date
- ap intermediate spot valuation news telugu
- ts intermediate spot valuation news telugu
- APInterEvaluation