Skip to main content

JEE Main result 2025: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల స్కోర్ కార్డ్ లింక్ ఇదే..!

JEE Main Session 1 Result Announcement  JEE Main Session 1 2025 Result Link   National Testing Agency JEE Main Results

దేశవ్యాప్తంగా ఈ ఏడాది జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు రాసిన అభ్యర్ధులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. వీరి ఉత్కంఠకు తెరదించుతూ ఎన్టీఏ ఇవాళ ఫలితాలు విడుదల చేసింది. ఈ మేరకు జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్ సైట్లో ఫలితాల లింక్ ఇచ్చింది. ఇందులో స్కోరు కార్డులు, ఇతర వివరాలు తెలుసుకునేందుకు వెబ్ సైట్, ఇతర వివరాలను ఇప్పటికే విడుదల చేసింది.

ఈ 10 చిట్కాలు ఫాలో అయితే చాలు..10th class, Inter పరీక్షల్లో టాప్ మార్కులు పక్కా: Click Here

వీటిని క్లిక్ చేయడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. దేశంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ గత నెలలో జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల ఫలితాలను ఇవాళ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఫలితాలకు సంబంధించిన వెబ్ సైట్ లింక్ ను ఎన్టీఏ విడుదల చేసింది.అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లోకి వెళ్లి జేఈఈ మెయిన్ ఫలితాల లింక్ ఓపెన్ చేస్తే ఫలితాలు వస్తాయి.


ఈ ఏడాది జేఈఈ సెషన్ 1 మెయిన్ పరీక్షల్లో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ మొత్తం 12 ప్రశ్నలను డ్రాప్ చేసింది. వీటికి పరీక్ష రాసిన అభ్యర్దులందరికీ ఫుల్ మార్కులు ఇవ్వబోతున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షల్లో క్వాలిఫై అయిన అభ్యర్ధులు JoSAA కౌన్సెలింగ్ ద్వారా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్టీఐ, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లలోకి ప్రవేశం పొందుతారు. దీంతో పాటు జేఈఈ మెయిన్ 2025లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష 2025లో హాజరయ్యేందుకు అర్హత సాధిస్తారు.

Published date : 12 Feb 2025 10:21AM

Photo Stories