Skip to main content

Rajiv Yuva Vikasam Scheme Application Link 2025 : యువ వికాసం పథకానికి ద‌ర‌ఖాస్తులు ప్రారంభం.. డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాసం పథకంను మార్చి 17వ తేదీన‌ ప్రారంభించారు.
rajiv yuva vikasam scheme application  Telangana CM Revanth Reddy launching Rajiv Yuva Vikasam Scheme  Important dates for Rajiv Yuva Vikasam Scheme applications

ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత... రాజీవ్ యువ వికాసం పథకంను  https://tgobmms.cgg.gov.in/ ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోచ్చు. మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.

5 లక్షల మందికి.. దాదాపు... 
ఈ పథకం కింద దాదాపు 5 లక్షల మందికి రూ.6 వేల కోట్లతో సబ్సిడీ రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. దీన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అమలు చేయనుంది. 

ఇలా రుణాలు ఇస్తారు...
ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఐటీడీఏ అధికారులను సంప్రదించాలని గిరిజన సహకార ఆర్థిక సంస్థ తెలిపింది. అర్హులకు కేటగిరీ 1, 2, 3 వారీగా రుణాలు ఇవ్వనున్నట్టు తెలిసింది. కేటగిరీ 1 కింద రూ.లక్ష వరకు రుణాలు అందిస్తారు. ఇందులో 80 శాతం రాయితీ పోను, మిగతా 20 శాతం లబ్ధిదారు భరించడమో లేదా బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడమో ఉంటుంది. కేటగిరీ 2 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు ఇస్తారు. ఇందులో 70 శాతం రాయితీ ఉంటుంది. కేటగిరీ 3 కింద 60 శాతం రాయితీతో రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తారు.

ఏప్రిల్‌ 6 నుంచి మే 31 వరకు..
ఏప్రిల్‌ 6 నుంచి మే 31 వరకు అప్లికేషన్ల వెరిఫికేషన్ కొనసాగుతుంది. అర్హులను ఎంపిక చేసి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు అయిన‌ జూన్ 2వ తేదీన‌ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేస్తారు. ఈ పథకం కింద ఒక్కొక్కరు గరిష్టంగా రూ.3 లక్షల వరకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందవచ్చు. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం తదితర వివరాలు ఆయా కార్పొరేషన్ల వెబ్‌సైట్‌లో ఇప్పటికే వెల్లడించారు.

➤☛  Telangana Rajiv Yuva Vikasam 2025 Applications Started : Check Direct Link Here! https://education.sakshi.com/en/careers/education-news/tg-rajiv-yuva-vikasam-2025-applications-direct-link-self-employment-govt-scheme-173513 

➤☛ యువ వికాసం పథకానికి ద‌ర‌ఖాస్తులు కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి
 

Published date : 18 Mar 2025 08:58AM

Photo Stories