Telangana Government Jobs 2025 : 50000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు... శాఖల వారిగా ఖాళీలు ఇవే...

56,740కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. 14,236 అంగన్వాడీ పోస్టులు ఉన్న్నాయి. ఇంకా 10,954 రెవెన్యూ పోస్టులు పోగా మిగిలినవి వివిధ శాఖల వారీగా ఉన్నాయి.
ప్రాథమిక జాబితాలో ఉన్న ఖాళీల భర్తీకి గాను వివిధ శాఖల్లో కలిపి 18,236 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. TGPSC, DSC, Police, Medical Departments ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నెల చివరి వారం నుంచి జూన్ 2 వరకు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మరో సారి గ్రూప్-1, 2, 3, 4 పోస్టులకు కూడా...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మరోసారి గ్రూప్-1తో పాటు గ్రూప్-2, 3, 4 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
శాఖల వారిగా ఖాళీల వివరాలు ఇవే...
1. పోలీసు శాఖలో 10,500 కానిస్టేబుళ్లు, 1,650 వరకు ఎస్ఐ పోస్టులను గుర్తించినట్టు సమాచారం.
2. వైద్య ఆరోగ్య శాఖలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, మరో 2,150 డాక్టర్ పోస్టులు ఉన్నాయి. వీటిలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతులు వచ్చాయి. అలాగే మరో 2వేల వరకు నర్స్ పోస్టులు ఉన్నాయని సమాచారం. వైద్య ఆరోగ్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మాసిస్టులు కలిపి దాదాపు 5000 పోస్టులు ఉన్నాయి.
➤☛ UPSC Civils Success Plans : యూపీఎస్సీ సివిల్స్ కొట్టాలంటే... ఈ టాప్ ర్యాంకర్లు చెప్పినవి పాటిస్తే చాలు...!
3. ఇంజినీరింగ్ విభాగాల్లోనూ 2000 నుంచి 3000 వరకు ఖాళీలు ఉన్నాయి.
4. ఆర్టీసీలో 3,038 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ఇప్పటికే ఆ సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించిన విషయం తెల్సిందే.
5. తెలంగాణ ఇంజినీరింగ్ విభాగాల్లో దాదాపు 2,510 పోస్టులు, వ్యవసాయ శాఖలో 148, ఆర్అండ్బీలో 185-200 వరకు పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.
6. అటవీ శాఖలోనూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు కొన్ని భర్తీ చేయాలని గుర్తించినట్టు తెలిసింది.
7. మహిళా శిశు సంక్షేమ శాఖలో 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్లు కలిపి 14,236 పోస్టులను భర్తీ చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.
8. గ్రామ పరిపాలన అధికారి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖల్లో ఉన్న 6 వేల మంది వీఆర్వోలను తిరిగి గ్రామ పరిపాలన అధికారులుగా నియమించన్నారు. మిగిలిన 4 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారు.
9. న్యాయశాఖ, సచివాలయం, ఆర్థికశాఖ సహా మరికొన్ని శాఖలన్నింటిలో కలిపి మరో 7-8 వేల పోస్టులు ఉన్నాయని.., వీటికి కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
Tags
- ts police jobs 2025
- ts police jobs 2025 notification
- TS DSC 2025 Notification Release
- TS DSC 2025 New Notification Release News in Telugu
- TS DSC 2025 Notification Release News in Telugu
- ts medical jobs news in telugu
- TS Medical Jobs News
- ts medical jobs 2025 news telugu
- telangana government jobs 2025
- ts government medical jobs 2025
- telangana government announces jobs 2025 notification
- ts constable jobs 2025 notification
- ts constable jobs 2025 notification news telugu
- telugu news ts constable jobs 2025 notification
- ts constable jobs 2025 news in telugu
- ts si jobs 2025 news in telugu
- ts revenue department jobs 2025
- ts revenue department jobs 2025 news telugu
- TS VRO jobs
- ts vro jobs updates
- ts vro jobs applications 2025
- ts vro jobs applications 2025 news in telugu
- ts vro jobs 2025
- ts revenue department recruitment 2025
- ts group 1 notification 2025
- ts group 2 notification 2025
- ts group 3 notification 2025
- ts group 4 notification 2025
- ts police jobs recruitment 2025
- ts police jobs 2025 constable
- ts police jobs 2025 constable news telugu
- ts government jobs notification 2025
- Anganwadi job vacancies in Telangana