Skip to main content

TS PGECET 2024: 30 నుంచి పీజీఈ సెట్‌ కౌన్సెలింగ్‌.. షెడ్యూల్‌ ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: ఎంటెక్, ఎంఈ, ఎంఆర్క్, ఎం ఫార్మసీ, ఫామ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి టీజీపీజీఈ సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను జూలై 30వ తేదీ నుంచి నిర్వహిస్తారు.
TS PGECET 2024 Counselling

ఉన్నత విద్యా­మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి నేతృత్వంలో జూలై 19న‌ జరిగిన సమావేశంలో కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. సమావేశంలో మండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎన్‌కే మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్, పీజీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి.రమేశ్‌బాబు పాల్గొన్నారు.  

చదవండి: Engineering Seats: సీఎస్‌ఈకే ప్రాధాన్యం.. 2024లో సీఎస్‌ఈ ఓపెన్‌ కేటగిరీలో సీట్లు వచ్చిన ర్యాంకులు ఇలా..

షెడ్యూల్‌ ఇలా.. 

ఫేజ్‌–1

తేదీ

వివరాలు

30.7.24 – 9.8.24

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన

1,8.24 – 3.8.24

ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్‌ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

12.8.24 – 13.8.24

వెబ్‌ ఆప్షన్లు

17.8.24

సీట్ల కేటాయింపు

18.8.24 – 21.8.24

కాలేజీల్లో రిపోర్టింగ్‌

ఫేజ్‌–2

20.8.24 – 23.8.24

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌

25.8.24 – 26.8.24

వెబ్‌ ఆప్షన్లు

30.8.24

సీట్ల కేటాయింపు

31.8.24 – 3.9.24

కాలేజీల్లో రిపోర్టింగ్‌ 

Published date : 20 Jul 2024 03:41PM

Photo Stories