Skip to main content

Engineering Seats: సీఎస్‌ఈకే ప్రాధాన్యం.. 2024లో సీఎస్‌ఈ ఓపెన్‌ కేటగిరీలో సీట్లు వచ్చిన ర్యాంకులు ఇలా..

సాక్షి, హైదరాబాద్‌: జాతీయస్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల భర్తీకి జోసా (జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ) నిర్వ హించిన కౌన్సెలింగ్‌లో భాగంగా జూలై 17న‌ ఐదవ విడత సీట్ల కేటా యింపు పూర్తిచేసింది.
National Level Engineering Colleges Counselin   July 17 Seat Allotment Update  Engineering College Seat Allocation  IIT Seat Allotment Process  many students Opt for BTech in Computer Science  JOSAA Counseling and Seat Allotment

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో సీట్ల భర్తీకి ఇది చివరిదశ. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో ఇంకా రెండు విడతల సీట్ల కేటాయింపు చేపడతారు.

దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 17,740 సీట్లు భర్తీ చేశారు. 31 ఎన్‌ఐటీల్లో 24,226,  దేశంలోని 26 ట్రిపుల్‌ ఐటీల్లో 8,546 సీట్లు, ఇతర సంస్థలు కలుపుకొని మొత్తం 60 వేల ఇంజనీరింగ్‌ సీట్లు భర్తీ చేశారు. జోసా కౌన్సెలింగ్‌లో ఈసారి 121 కాలేజీలు పాల్గొన్నాయి.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు పొందిన వారికి ఐఐటీల్లో, జేఈఈ మెయిన్‌ ర్యాంకు ఆధారంగా ఇతర జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. 

చదవండి: College Predictor - 2024 (AP & TG EAPCET, POLYCET & ICET)

కలిసొచ్చిన కటాఫ్‌... సీట్ల పెరుగుదల

ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కటాఫ్‌ పెరిగింది. దీంతో పాటు ఐఐటీల్లో అదనంగా వెయ్యి సీట్లు కొత్తగా చేర్చారు. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ ర్యాంకులు వచ్చినా సీట్లు దక్కించుకునే అవకాశం లభించింది. జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీ (నిట్‌)ల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు ఐఐటీల్లో ఏదో ఒక బ్రాంచీలో సీటు పొందే ఆలోచనకు దూరంగా ఉన్నారు. తాము కోరుకున్న సీటు ఎన్‌ఐటీల్లో పొందవచ్చని భావించారు. ఫలితంగా నిట్‌ వంటి సంస్థల్లో సీఎస్‌ఈకి ఈసారి ఎక్కువ పోటీ కనిపించింది. దీంతోపాటు రాష్ట్రస్థాయిలో ఉండే మంచి కాలేజీల వైపు జేఈఈ ర్యాంకర్లు కూడా మళ్లుతున్నారు.

చదవండి: Top 20 Engineering (Branch wise) Colleges in Telangana - Click Here

ఐఐటీ అడ్వాన్స్‌డ్‌ రాసినవారి సంఖ్య గతం కన్నా బాగా పెరిగింది. ఈ కారణంగానూ ఈసారి ఐఐటీ సీట్లు పొందే కటాఫ్‌ పెరిగింది. కానీ కౌన్సెలింగ్‌లో విద్యార్థుల పోటీ మాత్రం ఐఐటీల్లో అంతంత మాత్రంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది.

సీఎస్‌ఈ రాకుంటే ఐఐటీల్లో చేరడం లేదు 

అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు వచ్చినా విద్యార్థులు ఎన్‌ఐటీల్లో సీట్ల కోసమే ప్రయత్నిస్తున్నారు. ఐఐటీల్లో సీఎస్‌ఈలో సీటు వస్తే చేరేందుకు ఇష్టపడుతున్నారు. కానీ ఇతర బ్రాంచీల్లో సీటు వచ్చినా ఇష్టపడటం లేదు.

చదవండి: Engineering Seats: 2,640 ఇంజనీరింగ్‌లో పెరిగిన సీట్లు.. మరో 4 వేల సీట్లకు చాన్స్‌..

వీరంతా ఎన్‌ఐటీల్లో, రాష్ట్ర టాప్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల కోసం వెళుతున్నారు. ఈ కారణంగానే ఐఐటీల్లో గత ఏడాదికన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి సీట్లు వచ్చాయి. ఎన్‌ఐటీల్లో మాత్రం పోటీ తీవ్రంగానే కనిపిస్తోంది.    – ఎంఎన్‌.రావు, గణిత శాస్త్ర నిపుణుడు

ప్రధాన ఐఐటీల్లో గత ఏడాది.. 2024లో సీఎస్‌ఈ ఓపెన్‌ కేటగిరీలో సీట్లు వచ్చిన  ర్యాంకులు

ఐఐటీ

2024

2024

2023

2023

 

బాలురు

బాలికలు

బాలురు

బాలికలు

ముంబై

68

421

67

291

కాన్పూర్‌

252

1117

238

610

ఖరగ్‌పూర్‌

415

1661

279

702

ఢిల్లీ

116

556

118

419

మద్రాస్‌

159

757

148

479

హైదరాబాద్‌

656

1,809

674

1300

తిరుపతి

5,024

6,324

3,701

6,558

రూర్కీ

481

1,870

412

1,165

పాలక్కాడ్‌

6,199

9,127

5,162

9,104

భిలాయ్‌

6,516

11,544

5,791

11,200

గోవా

5,371

11,151

4,732

7,646

ధవాడ్‌

6,375

11,138

5,978

10,825

జమ్మూ

6,310

12,108

4,856

9,840

ప్రధాన నిట్‌లలో గత ఏడాది, ఈ సంవత్సరం ఓపెన్‌ కేటగిరీలో సీఎస్‌ఈ సీట్లు వచ్చిన చివరి ర్యాంకులు

ఎన్‌ఐటీలు

2024

2024

2023

2023

 

బాలురు

బాలికలు

బాలురు

బాలికలు

వరంగల్‌

2,804

4,683

3,115

4,530

తిరుచి

1,224

2,172

1,509

2,086

సూరత్‌కల్‌

1,615

2,433

1,984

3,298

క్యాలీకట్‌

4,482

8,068

5,256

6,850

తాడేపల్లిగూడెం

18,548

24,130

17,272

23,150

జలంధర్‌

10,957

17,015

11,017

17,138

అగర్తల

20,298

35,092

20,102

31,404

మిజోరం

33,181

43,362

31,326

38,582

మణిపూర్‌

30,611

43,862

29,644

44,910

Published date : 18 Jul 2024 12:20PM

Photo Stories